Russia, Ukraine War : రష్యా, ఉక్రెయిన్ వార్కి ఎండ్ కార్డ్? ఇండియా గ్లోబల్ మ్యాజిక్ ..
Russia, Ukraine War : రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలతోనూ ఒకే సమయంలో డైరెక్ట్ చర్చలను జరుపుతూ, అసలు సమస్యలను స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసే ప్లాన్ అమలు చేస్తోంది.
Russia, Ukraine War
రష్యా, ఉక్రెయిన్ మధ్య బాంబుల మోత ఇప్పట్లో ఆగేలా లేదు. దీంతో మూడో ప్రపంచ యుద్ధానికి ఇక ఎండ్ కార్డ్ పడదా అనే టెన్షన్లో యావత్ ప్రపంచం మునిగిపోయింది. అగ్రదేశాలు కూడా చేతులెత్తేసిన సమయంలో ఇప్పుడు అందరి దృష్టి భారతదేశంపైనే పడింది.
ఎందుకంటే ఇన్నాళ్లూ శాంతి సమాధానాలు చెప్పే పక్కా న్యూట్రల్ దేశంగా ఉన్న భారత్..ఇప్పుడు సైలెంట్‌గా గేమ్ ఛేంజర్‌లా డైరెక్టుగా సీన్లోకి ఎంటర్ అయింది. యుద్ధాన్ని ఆపడానికి ఇండియా వేస్తున్న వ్యూహాత్మక దౌత్య అడుగులు ఇంటర్నేషనల్ పాలిటిక్స్‌ను ఊపేస్తున్నాయి.
ఒక రోజులోనే వార్‌కు ఫుల్స్టాప్ పెట్టడం అసాధ్యం . దీంతోనే భారత్ ఒక పక్కా ప్రాక్టికల్ రూట్ మ్యాప్‌ను ఎంచుకుంది. రష్యా, ఉక్రెయిన్(Russia, Ukraine War) రెండు దేశాలతోనూ ఒకే సమయంలో డైరెక్ట్ చర్చలను జరుపుతూ, అసలు సమస్యలను స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసే ప్లాన్ అమలు చేస్తోంది.
దీనిలో మొదటిది నల్లసముద్రం(Black Sea) ద్వారా ప్రపంచానికి వెళ్లే ఆహార ధాన్యపు నౌకలకు భద్రత కల్పించడం.అలాగే రెండోది గ్లోబల్ ఎనర్జీ సప్లై దెబ్బతినకుండా చూడటం. ఇక మూడోది రెండు దేశాలు ఒకరి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై మరొకరు దాడులు చేసుకోకుండా సీజ్ఫైర్ ఒప్పందాన్ని కుదిర్చేలా చేయడం. ఇండియా వేసిన ఈ రియలిస్టిక్ ప్లాన్‌కు ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్‌గా విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.
ఇండియా వేసిన ఈ శాంతి ప్రణాళికకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడం మరింత విశేషతను సంతరించుకుంది. ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగించడానికి భారత దేశం సేకరించిన ఆలోచనలు చాలా ఆచరణాత్మకంగా ఉన్నాయని రష్యా ఓపెన్‌గానే ప్రశంసించింది.
మరోవైపు ఉక్రెయిన్ కూడా అగ్రరాజ్యం అమెరికాతో పాటు టర్కీ, ఈజిప్ట్ వంటి దేశాల నుంచి వచ్చిన కంటే పీస్ ప్లాన్ కంటే భారత్ పంపిన శాంతి ప్రతిపాదన మాత్రమే చాలా స్పష్టంగా ఉండటంతో పాటు అమలు చేయడానికి వీలుగా ఉందంటూ జై కొట్టింది. శత్రుదేశాలుగా మారిపోయిన రష్యా, ఉక్రెయిన్(Russia, Ukraine War) దేశాలు కూడా ఒకే దేశపు ప్లాన్‌కి జై కొట్టడం గ్లోబల్ హిస్టరీలోనే అరుదైన విషయం.

భారతదేశానికి రష్యాతో ఉన్న దశాబ్దాలుగా నమ్మకమైన బంధం, మరోవైపు ఉక్రెయిన్‌తో ఉన్న స్నేహపూర్వక దౌత్యం భారత్‌ను ఈ రోల్‌కి పర్ఫెక్ట్ ఫిట్‌గా మార్చాయి. రక్షణ రంగానికి మాత్రమే పరిమితం కాకుండా వ్యాపారం, ఎనర్జీ, అణు రంగాలు, టెక్నాలజీ వరకు విస్తరించిన ఈ ఫ్రెండ్లీ డిప్లమసీ ఇప్పుడు ప్రపంచ శాంతికి ఆయుధంగా మారడం హాట్ టాపిక్ అయింది.
రష్యా,ఉక్రెయిన్లను మాటలతో కాకుండా చేతలతో ఒకే తాటిపైకి తెచ్చే ఏకైక గ్లోబల్ పవర్‌గా భారత్ ఎదిగి చూపించింది. భారత్ శక్తి ఏంటో నిరూపిస్తున్న ఈ శాంతి మిషన్‌కు ఇప్పుడు ప్రపంచమంతా హాట్స్ ఆఫ్ చెబుతోంది.





