Just LifestyleLatest News

Avocado : బరువు తగ్గడానికే కాదు బ్రెయిన్‌కి కూడా బాస్..అవకాడోను రెగ్యులర్‌గా తింటే బోలెడ్ బెనిఫిట్స్..

Avocado : అవకాడోలో ఉండే ఫైబర్ శరీరానికి బాగా హెల్ప్ చేస్తుంది. దీనిలో ఉండే పీచు పదార్థం పేగుల కదలికలను ట్రాక్‌లోకి తెచ్చి, డైజెషన్ వేగాన్ని పెంచుతుంది.

Avocado

ఫుడ్ లవర్స్ నుంచి ఫిట్‌నెస్ ఫ్రీక్స్ వరకు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్న ఒకే ఒక్క పేరు అవకాడో ఫ్రూట్ అన్నది అందరికీ తెలిసిందే. బయటకు హార్డ్‌గా కనిపించే ఈ పండు..ముక్కలుగా కోసి నోట్లో వేసుకుంటే మాత్రం వెన్నలా అలా కరిగిపోతుంది.

అందుకే మోడ్రన్ హెల్త్ వరల్డ్‌లో అవకాడోను కేవలం ఒక నార్మల్ పండులా కాకుండా ఒక పవర్‌ఫుల్ సూపర్‌ఫుడ్ అని ముద్దుగా పిలుస్తున్నారు. హార్ట్ పదిలంగా ఉండటం నుంచి ఫేస్ మెరిసి పోవడం వరకు అవకాడో ఇచ్చే రిజల్ట్స్ వేరే లెవల్‌లో ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అవకాడో(Avocado)లో ఉండే ఫైబర్ శరీరానికి బాగా హెల్ప్ చేస్తుంది. దీనిలో ఉండే పీచు పదార్థం పేగుల కదలికలను ట్రాక్‌లోకి తెచ్చి, డైజెషన్ వేగాన్ని పెంచుతుంది. రోజువారీ డైట్‌లో ఇది భాగమైతే మలబద్దకం సమస్య పారిపోవడమే కాకుండా పొట్టలో గుడ్ బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది.

ఇక గుండెను భద్రంగా ఉంచడంలో అవకాడో(Avocado) చేసే మ్యాజిక్ వేరేగా ఉంటుంది. దీనిలో లభించే మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు శరీరంరలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టి, హార్ట్‌కు మేలు చేసే గుడ్ కొలెస్ట్రాల్‌ను బూస్ట్ చేస్తాయి. దీనివల్ల బీపీ కంట్రోల్‌లో ఉండి హార్ట్ అటాక్,పెరాలసిస్ వంటి పెద్ద ప్రమాదాల నుంచి బాడీకి రక్షణ దొరుకుతుంది.

అలాగే అవకాడో తింటే స్కిన్ గ్లో అవుతుంది. దీనిలో నిండి ఉండే విటమిన్- సి, విటమిన్-ఇ స్కిన్‌కు నేచురల్ మాయిశ్చరైజింగ్ నూనెలను అందించి, చర్మం పొడి బారకుండా కాపాడతాయి. దీనిలోని పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్ సెల్స్‌ను పాడుచేసే ఫ్రీ రాడికల్స్‌తో ఫైట్ చేసి, ఏజ్ పెరిగినా ముఖంపై ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచుతాయి.

Avocado
Avocado

వెయిట్ తగ్గాలనుకునే వారికి కూడా అవకాడో అమేజింగ్ ఆప్షన్. ఇది తిన్న కొద్దిసేపటికే కడుపు నిండిన ఫీలింగ్ రావడంతో జంక్ ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి. అంతేకాకుండా దీనిలోని ల్యూటిన్, జెక్సాంథిన్ అనే కెరోటినాయిడ్లు ఏజ్‌తో పాటు వచ్చే కంటి సమస్యలను తగ్గిస్తాయి.

ఈ వెన్న పండును ఇష్టం ఉన్నవాళ్లు అలాగే చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకుని తినొచ్చు. లేదంటే స్మూథీలలో, సలాడ్లలో లేదంటే టోస్ట్‌లపై జామ్‌లా రాసుకుని తినేయొచ్చు. ప్రతిరోజూ అవకాడోను మీ ప్లేట్‌లో చేర్చుకుంటే జీర్ణక్రియ, స్కిన్, హార్ట్ ఎప్పటికి కూడా కండీషన్‌లోనే ఉంటాయి.

Zero Calories Foods : జీరో క్యాలరీస్ – ఫుల్ ప్రోటీన్.. ఈ 7 సూపర్ ఫుడ్స్ తింటే చాలు..

Related Articles

Back to top button