Sheikh Hasina : డిసెంబరులో బంగ్లాదేశ్ వెళ్లి లొంగిపోతా..చావడానికైనా రెడీ అంటున్న షేక్ హసీనా
Sheikh Hasina : బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ విచారణ జరిపి.. గతేడాది హసీనా మరణశిక్ష కూడా విధించింది. అయితే ఈ కేసులన్నీ కేవలం రాజకీయ కక్ష సాధింపుల కోసం పెట్టినవేనని హసీనా కొట్టిపారేశారు.
Sheikh Hasina
2024 జూలైలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో మొదలైన స్టూడెంట్స్ ఉద్యమం ఎంత పెద్ద దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. ఆ హింసాత్మక గొడవల వల్ల అప్పటి ప్రధానమంత్రి, అవామీ లీగ్ పార్టీ లీడర్ షేక్ హసీనా(Sheikh Hasina) తన పదవికి రిజైన్ చేసి, ప్రాణాలు కాపాడుకోవడానికి ఇండియాకు పారిపోయి వచ్చారు.
ఆరోజు నుంచి ఇప్పటి వరకూ కూడా ఆమె ఇండియాలోనే రహస్యంగా ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు చాలాసార్లు విజ్ఞప్తులు వచ్చినా కేంద్ర ప్రభుత్వం మాత్రం రెస్పాండ్ అవ్వలేదు. కాగా తాజాగా షేక్ హసీనా(Sheikh Hasina) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మళ్లీ తన స్వదేశానికి వెళ్లడానికి రెడీ అయ్యానని, వచ్చే డిసెంబరులో బంగ్లాదేశ్‌కు వెళ్లి కోర్టు ముందు లొంగిపోతానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.
రాయిటర్స్ వార్తా సంస్థకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన హసీనా .. స్వదేశానికి వెళ్లిన తర్వాత తనను అరెస్ట్ చేసినా లేదా ప్రాణాలు తీసేసినా కూడా దేనికైనా రెడీ అని క్లియర్‌గా చెప్పారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో తీవ్ర అణచివేతకు గురవుతున్న తన పార్టీ నేతలు, కార్యకర్తల కోసం తాను వెళ్లి తీరాలని డిసైడ్ అయినట్లు ఆమె వివరించారు.
ఒకవేళ తనకు చావే కనుక రాసిపెట్టి ఉంటే, తన సొంత గడ్డపైనే అది కూడా తన తల్లిదండ్రులను సమాధి చేసిన చోట చనిపోవాలని కోరుకుంటున్నట్లు ఎమోషనల్ అయ్యారు. వచ్చే డిసెంబరులో తనతో పాటు అవామీ లీగ్ పార్టీ సీనియర్ లీడర్స్ అంతా కలిసి బంగ్లాదేశ్‌కు వెళ్లి కోర్టుల్లో లొంగిపోవాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తనను అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం ఇండియాకు వరుసగా లెటర్స్ రాస్తుండటంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, అయితే దీనిపై ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు చేయలేదని స్పష్టం చేశారు.
కాగా యువత నిరసనలను తొక్కేయడంలో షేక్ హసీనా పాత్ర ఉందంటూ ఆమెపై బంగ్లాదేశ్‌లో చాలా కేసులు ఫైల్ అయ్యాయి. అంతేకాదు బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ విచారణ జరిపి.. గతేడాది హసీనా మరణశిక్ష కూడా విధించింది. అయితే ఈ కేసులన్నీ కేవలం రాజకీయ కక్ష సాధింపుల కోసం పెట్టినవేనని హసీనా కొట్టిపారేశారు. కోర్టులో విచారణ మొదలయ్యాక ఈ కేసులు ఎంత కామెడీగా ఉన్నాయో జనాలకు అర్థమవుతుందని, తానేంటో నిరూపించుకోవడానికే డిసెంబర్లో లొంగిపోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

తనకు జైలు జీవితం కొత్త కాదని, తన పొలిటికల్ కెరీర్లో చాలాసార్లు జైలుకు వెళ్లొచ్చినట్లు హసీనా గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని 300 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సుమారు 125 నియోజకవర్గాల లీడర్లతో ఆన్లైన్ మీటింగ్స్ పెడుతూ అవామీ లీగ్‌ను మళ్లీ సెట్ చేసే పనిలో ఉన్నానని అన్నారు. తన 20 ఏళ్ల పాలనలో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చని నిజాయితీగా ఒప్పుకుంటూనే, తనపై అంతిమ తీర్పు ఇచ్చే అధికారం కేవలం బంగ్లాదేశ్ ప్రజలకే ఉందని షేక్ హసీనా(Sheikh Hasina) నొక్కి చెప్పారు.





