Just InternationalJust PoliticalLatest News

Strait Of Hormuz : దూకుడు పెంచిన ఇరాన్..హర్మూజ్ జలసంధిలో మళ్లీ క్షిపణి దాడి

Strait Of Hormuz : హర్మూజ్ జలసంధిలో వెళుతున్న ఒక భారీ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ వేసిన మిస్సైల్ తాకడంతో.. నౌకలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ దాడి వల్ల పక్కనే ఉన్న మరో ఇంధన నౌక కూడా కొద్దిగా దెబ్బతింది.

Strait Of Hormuz

మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధి ఇప్పుడు కళ్లముందే మరోసారి రగిలిపోతోంది. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ కాస్త తగ్గి, చర్చలకు మొగ్గు చూపిస్తుంటే..ఇరాన్ మాత్రం తగ్గట్లేదు.

సముద్ర మార్గాల్లో దాడులను పెంచుతూ గ్లోబల్ పవర్స్‌కి మైండ్ బ్లాక్ అయ్యే షాక్‌లు ఇస్తోంది. ఈ హఠాత్ పరిణామాల వెనుక ఇరాన్ వేసిన స్కెచ్ ఏంటి? ఈ దాడులతో ట్రంప్ తన వ్యూహాన్ని మార్చుకుంటారా అనే చర్చ ఇప్పుడు ప్రపంచ వేదికపై హాట్ టాపిక్‌గా మారింది.

హర్మూజ్ జలసంధిలో వెళుతున్న ఒక భారీ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ వేసిన మిస్సైల్ తాకడంతో.. నౌకలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ దాడి వల్ల పక్కనే ఉన్న మరో ఇంధన నౌక కూడా కొద్దిగా దెబ్బతింది. ఈ ట్యాంకర్లు ఏ దేశానికి చెందినవి, నౌకలోని సిబ్బంది పరిస్థితి ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఒకవైపు ఈ హర్మూజ్ జలసంధి సేఫ్టీపై ఒమన్‌తో అమెరికా కీలకమైన చర్చలు జరుపుతుండగా.. మరోవైపు ఇరాన్ ఈ రచ్చ మొదలుపెట్టింది. అంతేకాదు దక్షిణ ఇరాన్ గగనతలంలో నిఘా పెట్టిన అమెరికాకు చెందిన అత్యాధునిక ఎంక్యూ-9 డ్రోన్‌ను ఇరాన్ ఐఆర్‌జీసీ దళాలు గాల్లోనే పేల్చేశాయని లోకల్ మీడియా సంచలన కథనాలు వెలువరించింది.

అటు ఇరాన్ అలా విరుచుకుపడుతుంటే.. ఇటు సౌదీ అరేబియా టార్గెట్‌గా హూతీ తిరుగుబాటుదారులు దాడులతో విరుచుకుపడుతున్నారు. సౌదీ సైనికులను లక్ష్యంగా చేస్తూ ఓడరేవుపై జరిపిన దాడిలో ఏడుమంది ప్రాణాలు కోల్పోయారు.

అంతేకాదు, సౌదీకి చెందిన ఇంధన దిగ్గజం అరామ్‌కో నిర్వహించే జాజన్ రిఫైనరీపై హూతీలు క్షిపణులు, డ్రోన్లతో అటాక్ చేయడంతో అక్కడ భారీగా మంటలు వ్యాపించి రిఫైనరీని టెంపరరీగా క్లోజ్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ ఘటనలో ఆస్తి, ప్రాణనష్టం లెక్క తేలాల్సి ఉంది.

ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఇటీవల పాక్, టర్కీ, సౌదీ అరేబియా మూడు దేశాలు కలిసి మక్కా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ డీల్ ప్రకారం ఈ మూడింటిలో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా కూడా.. మిగిలిన రెండు దేశాలు దాన్ని తమ దేశంపై జరిగిన దాడిగానే భావించి వారికి మద్దతుగా నిలబడి దాడి చేసిన దేశంపై తిరగబడాలి. ఈ అగ్రిమెంట్ సంతకాలు జరిగిన కొద్ది రోజులకే.. సౌదీ అరేబియాపై దాడులు జరగడం చూస్తుంటే ఇరాన్, హూతీల కూటమి.. ఆ దేశాలు సవాల్ విసురుతున్నట్లే కనిపిస్తోంది.

Strait Of Hormuz
Strait Of Hormuz

ఇరాన్ ఈ రేంజ్‌లో దూకుడు చూపించడం వెనుక ఒకే ఒక స్ట్రాటజీ ఉందని నిపుణులు చెబుతున్నారు. తమ మధ్య చర్చలు జరిగే సమయానికి ఇరాన్ చెయ్యి పైన ఉండాలని, తమపై ఉన్న ఆంక్షలన్నిటినీ ఎత్తేసేలా అమెరికాపై ఒత్తిడి పెంచడానికే ఈ దాడులను అస్త్రంగా వాడుతోంది.

పైగా హర్మూజ్ జలసంధిని(Strait Of Hormuz) బ్లాక్ చేసేస్తే అంతర్జాతీయ ఇంధన ధరలు మండిపోతాయని అమెరికాను భయపెట్టే ప్లాన్ కూడా దీనిలో ఉంది. అయితే, ఇరాన్ వేసిన ఈ రివర్స్ స్కెచ్ చూశాక..డొనాల్డ్ ట్రంప్ కామ్‌గా ఊరుకుంటారా లేదా తన నిర్ణయాన్ని మార్చుకుని మరింత కఠినంగా విరుచుకుపడతారా అన్నది చూడాలి.

Astrology : జాతకం ఎప్పుడు పడితే అప్పుడు చూపించకూడదా.. ఈ 4 సందర్భాల్లోనే చూపించాలా?

Related Articles

Back to top button