Planetary Parade : ఈరోజు ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఒకే రోజు 4 ఖగోళ వింతలతో మైండ్ బ్లాకింగ్ సీన్!
Planetary Parade : ఖగోళ హిస్టరీలోనే ఎప్పుడూ లేని విధంగా ఒక్క రోజులోనే ఏకంగా నాలుగు అరుదైన ఖగోళ సంఘటనలు వరుసబెట్టి ఆవిష్కృతం కాబోతుండటం సైంటిస్టులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Planetary Parade
ఈ అనంత విశ్వంలో మన ఊహకు అందని ఎన్నెన్నో వింతలు, వింతైన సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. కానీ, ఖగోళ హిస్టరీలోనే ఎప్పుడూ లేని విధంగా ఒక్క రోజులోనే ఏకంగా నాలుగు అరుదైన ఖగోళ సంఘటనలు వరుసబెట్టి ఆవిష్కృతం కాబోతుండటం నిజంగా సైంటిస్టులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ ఆగస్ట్ 12న ఆకాశం ఒక మాయా ప్రపంచంలా మారబోతోంది. ఒకవైపు 6 గ్రహాలు ఒకే వరుసలో నిలబడే గ్రహాల పరేడ్ సందడి చేయగా, మరోవైపు సూర్యుడిని కప్పేసే సంపూర్ణ సూర్యగ్రహణం, ఇంకోవైపు గమ్మత్తైన అమావాస్య నిశీధి.. వీటన్నింటికీ తోడు చీకట్లను చీల్చుకుంటూ నిప్పులు చిమ్ముతూ రాలే పర్సీడ్ ఉల్కాపాతం ఇలా ఒకదానికొకటి ఖగోళ హిస్టరీలో నిలిచిపోయే అపురూప ఘట్టాన్ని నమోదు చేయబోతున్నాయి.
సాధారణంగా ఇవన్నీ సంవత్సరం పొడవునా వివిధ సమయాలలో విడివిడిగా జరుగుతుంటాయి. కానీ, సృష్టి లయలో ఇవన్నీ ఒకే రోజు, ఒకే వరుసలో రావడం గతంలో ఎప్పుడూ లేని ఒక మైండ్ బ్లాకింగ్ వండర్ అని చెప్పొచ్చు.
ఈ ఖగోళ సంబరంలో మొదటి ఘట్టం ఆగస్ట్ 12 తెల్లవారుజామున, సూర్యోదయానికి ముందే మొదలయింది. సౌర కుటుంబంలోని బృహస్పతి, బుధుడు, అంగారకుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ అనే 6 గ్రహాలు తూర్పు నుంచి పడమర వరకు ఆకాశంలో ఒకే వరుసలో కొలువుదీరి ఆశ్చర్యపరిచాయి.
దీనిలో అంగారకుడు, శని గ్రహాలను మనం నేరుగా కంటితోనే చూసినా.. చాలా దూరంలో ఉండే యురేనస్, నెప్ట్యూన్లను చూడటానికి బైనాక్యులర్స్ లేదా టెలిస్కోప్ వాడి వీక్షించారు. ఖగోళ శాస్త్రంలో ప్లానెట్ పరేడ్ అనేది అధికారిక పదం కాకపోయినా.. గ్రహాలన్నీ కూడా ఒకే సరళరేఖలో కనిపించే ఈ అరుదైన స్థితిని అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికే ఈ పేరు పెట్టినట్లు తెలుస్తోంది.
ఇక రెండో ఘట్టంగా అదే రోజు సంపూర్ణ సూర్యగ్రహణం ఆవిష్కృతం కాబోతోంది. భూమికి, సూర్యునికి మధ్యలోకి చంద్రుడు రావడం వల్ల సూర్యుడు పూర్తిగా మాయమై పగలే చీకటిగా మారిపోతుంది. ఐస్లాండ్, గ్రీన్లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్, పోర్చుగల్‌లలో ఇది సంపూర్ణంగా కనిపిస్తుంది.
అలాగే ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో అయితే పాక్షికంగా సూర్యుడు నెలవంక ఆకారంలో కనిపిస్తుంది. కాకపోతే ఇది మన దేశంలో కనిపించదు. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం ఆగస్ట్ 12 రాత్రి 9:45 నుంచి ఆగస్ట్ 13 తెల్లవారుజామున 2:15 మధ్య జరుగుతుంది. ఆ సమయానికి మన దగ్గర సూర్యుడు క్షితిజ సమాంతర రేఖకు దిగువన ఉంటాడు కాబట్టి భారతదేశంలో దీన్ని చూడలేం.
మూడో ఘట్టంగా ఈ గ్రహణానికి పునాది అయిన అమావాస్య నిశీధి ఈరోజే ఏర్పడుతుంది. సూర్యకాంతి చంద్రుడి వెనుక భాగంపైనే పడటం వల్ల, భూమి వైపు ఉండే చంద్రుడి భాగం దట్టమైన చీకటితో నిండిపోతుంది. వెన్నెల వెలుతురు లేని ఈ నల్లటి ఆకాశం నక్షత్రాలను, అంతరిక్షాన్ని చూడటానికి స్టారగాజర్లకు (Stargazing) పర్ఫెక్ట్ బ్యాక్‌డ్రాప్‌ని అందిస్తుంది.

ఇక నాలుగవ ఘట్టంగా ఆ అమావాస్య చీకట్లోనే ఆకాశంలో పర్సీడ్ ఉల్కాపాతం కలర్‌ఫుల్ విన్యాసాలు చేయబోతోంది. వెన్నెల వెలుతురు అడ్డురాకపోవడం వల్ల గంటకు సుమారు 100 ఉల్కలు అంటే.. షూటింగ్ స్టార్స్ ఆకాశం నుంచి రాలడాన్ని మనమంతా చాలా క్లియర్ చూడొచ్చు. మిరుమిట్లు గొలిపే అగ్నిగోళాల వంటి పెద్ద ఉల్కలు, మెరుపు తీగల్లాంటి చిన్న ఉల్కలు అన్నీ కూడా నింగిలో వండర్స్ క్రియేట్ చేయనున్నాయి.
ఆగస్ట్ 12, 13, 14 తేదీల్లో సూర్యోదయానికి ముందున్న సమయం దీనికి బెస్ట్ టైమ్ అని ఖగోళ పరిశోధకులు చెబుతున్నారు. పర్సీడ్ ఉల్కాపాతం పీక్ స్టేజ్‌లో ఉండటం, అదే రోజు అమావాస్య కూడా రావడం అనే ఈ అరుదైన సంయోగం.. మళ్లీ 19 ఏళ్ల తర్వాత, అంటే 2045లోనే జరుగుతుందని అంటున్నారు.
Strength : కాలర్ ఎగరేయడం, అరవడం కాదు.. రియల్ స్ట్రెంత్ అంటే ఇదే..





