NATO : నాటో వేదికపై స్పెయిన్‌కు ట్రంప్ వార్నింగ్..అమెరికా అధ్యక్షుడి తీరుపై స్పెయిన్ ఫైర్
NATO : స్పెయిన్‌తో అమెరికాకు ఉన్న వాణిజ్య, ఆర్థిక సంబంధాలను వెంటనే ఆపేయాలని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్‌కు ట్రంప్ సభలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
NATO
ప్రపంచ వేదికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించే తీరు ఎప్పుడూ భిన్నంగానే ఉంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా టర్కీ రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో(NATO) సమావేశాల్లో కూడా ట్రంప్ అదే దూకుడు ప్రదర్శించారు. కూటమిలోని భాగస్వామ్య దేశమైన స్పెయిన్‌ను టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా రియాక్టయ్యారు.
స్పెయిన్‌తో అమెరికాకు ఉన్న వాణిజ్య, ఆర్థిక సంబంధాలను వెంటనే ఆపేయాలని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్‌కు సభలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అది కూడా నాటో(NATO) సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టె ముందే.. ఈ రేంజ్‌లో డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడటం ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.
స్పెయిన్‌ను ఓ వేస్ట్ కంట్రీగా అభివర్ణించిన ట్రంప్.. నాటో రక్షణకు అవసరమైన నిధులను ఆ దేశం సరిగ్గా అందించడం లేదని ఆరోపించారు. కాబట్టి వారితో ఇక వ్యాపారాలు ఆపేస్తే వాళ్లే దారికొస్తారంటూ ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అయితే రాబోయే 2035 నాటికి జీడీపీలో 5 శాతం నిధులను డిఫెన్స్ కోసం కేటాయించాలనే నాటో కొత్త నిబంధనలకు స్పెయిన్ అంగీకరించకపోవడంతోనే ట్రంప్ ఇలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో నాటో చీఫ్ రుట్టె జోక్యం చేసుకుని.. స్పెయిన్ ఇప్పటికే రక్షణ బడ్జెట్‌ను 2 శాతానికి పెంచిందని చెప్పి డొనాల్డ్ ట్రంప్‌ను శాంతపరిచే ప్రయత్నం చేశారు.
కానీ ఈ కోపానికి కేవలం బడ్జెట్ మాత్రమే కారణం కాదని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల అమెరికా, ఇరాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల సమయంలో, అమెరికా దాడుల కోసం తమ మిలిటరీ స్థావరాలను వాడుకోవడానికి స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ఖరాఖండీగా నో చెప్పేశారు. అంతేకాకుండా అమెరికా వైఖరిని ఓపెన్‌గానే తప్పుబట్టారు.
ఆరోజు నుంచే ఈ రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ సమావేశంలో ఇరాన్‌పై కూడా డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఆ దేశ నేతల ఆలోచనా విధానం ఏమాత్రం సరిగ్గా లేదని, వారితో ఉన్న టెంపరరీ అగ్రిమెంట్ ముగిసిందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

ట్రంప్ చేసిన ఈ హెచ్చరికలపై స్పెయిన్ మాత్రం చాలా సంయమనంతోనే స్పందించింది. అమెరికాతో తమ సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయని స్పెయిన్ పీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా, తాము ఈయూ అంటే ఐరోపా సమాఖ్య పరిధిలో ఉండటం వల్ల, అమెరికా ఏకపక్షంగా తమపై వాణిజ్య ఆంక్షలను విధించడం సాధ్యం కాదంటూ పరోక్షంగా చురకలంటించింది.
మరోవైపు స్పెయిన్ హెల్త్ మినిష్టర్ మోనికా గార్సియా అయితే అమెరికా అధ్యక్షుడికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎవరి బెదిరింపులకూ లొంగకపోవడం వల్లే తమను విమర్శిస్తున్నారని అన్నారు. అంతేకాదు దౌత్యానికి, దౌర్జన్యానికి మధ్య తేడా తెలుసుకోవాలని మోనికా గార్సియా ఎక్స్ వేదికగా ట్రంప్‌పై విరుచుకుపడ్డారు.
VIDEO | US President Donald Trump says, "I spoke to Italy… I didn't speak to Spain. Spain is a wasted cause. We don't want to do any trade business with Spain anymore, by the way. I'd like you to cut it off. Spain is a terrible partner in NATO. They don't participate. They… pic.twitter.com/TwtRHz8GCN
— Press Trust of India (@PTI_News) July 8, 2026
Investment : స్టాక్ మార్కెట్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్..మీ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఏంటి?





