US Student Visa : ఇటు డాలర్ డ్రీమ్‌కి బ్రేకులు..అటు అమెరికా కాలేజీల్లో సీట్లు, ఖజానా ఖాళీ
US Student Visa : ఇప్పుడు అమెరికా కాలేజీలో సీటు వచ్చినా కూడా వీసా ఎప్పుడు చేతికి వస్తుందనేది తెలీడం లేదు. అంతా ఓకే అనుకునే టైమ్‌కి ఇమ్మిగ్రేషన్ రూల్స్ మారిపోతే పరిస్థితి ఏంటనే సస్పెన్స్ మొదలవుతోంది
US Student Visa
యూఎస్ వెళ్లి చదువుకుని జీవితంలో సెటిల్ అవుదామనుకునే ఇతర దేశాల విద్యార్థుల ఆశలకు మరోసారి అడ్డంకులు ఎదురవుతున్నాయి. అడ్మిషన్ లెటర్ చేతికి వచ్చినా కూడా అసలు కథ ముందు ఉందనే విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. 2026 విద్యా సంవత్సరానికి అక్కడ సగానికి పైగా కాలేజీలు, యూనివర్సిటీలకు గ్లోబల్ స్టూడెంట్స్ అప్లికేషన్లు బాగా తగ్గిపోయాయి. వీసాలు రాకపోవడంతో పాటు విపరీతమైన ఆలస్యం, పెరిగిన రిజెక్షన్లు, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు స్ట్రిక్టుగా మారడం దీనికి మెయిన్ రీజన్ అవుతున్నాయి. దీంతో ముఖ్యంగా భారత్, చైనా కుర్రాళ్లలో టెన్షన్ పెరిగిపోతోంది.
అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎడ్యుకేషన్ (ACE)328 మంది హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ సీనియర్ అధికారులతో జరిపిన సర్వేలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. దీనిలో 63 శాతం మంది ఇమ్మిగ్రేషన్ ఆంక్షలు, వీసాల క్యాన్సిలేషన్‌పై ఆందోళన వ్యక్తం చేయగా.. ఇలాంటి అన్-ఎక్స్పెక్టెడ్ పరిస్థితులను తట్టుకోవడం తప్ప తమ యూనివర్సిటీలు దానికి రెడీగా లేవని 36 శాతం మంది కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. స్టూడెంట్స్ తగ్గడం వల్ల తమ ఇన్కమ్ దారుణంగా పడిపోయిందని ఫారిన్ స్టూడెంట్స్‌ను చేర్చుకునే 73 శాతం మంది కాలేజీ ప్రెసిడెంట్లు ఒప్పుకున్నారు.
ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఎఫెక్ట్ ఇప్పటికే క్యాంపస్‌లలో చాలా క్లియర్‌గా కనిపిస్తోంది. బడ్జెట్ కోతలతో 23 శాతం ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ రీసెర్చ్ ప్రాజెక్టులు, స్టూడెంట్ హెల్ప్ ఫండ్స్‌ను తగ్గించేశాయి. ఫండ్స్ లేక డిమాండ్ లేని కొన్ని కోర్సులను పూర్తిగా మూసేయడం లేదా వేరే వాటితో కలిపేయడం చేశామని 9 శాతం మంది కాలేజీ ప్రెసిడెంట్లు చెప్పారు. మరో 11 శాతం మంది స్టూడెంట్స్ స్కాలర్షిప్లను తగ్గించక తప్పలేదని వివరించారు.

ఇప్పుడు అమెరికా కాలేజీలో సీటు వచ్చినా కూడా వీసా ఎప్పుడు చేతికి వస్తుందనేది తెలీడం లేదు. అంతా ఓకే అనుకునే టైమ్‌కి ఇమ్మిగ్రేషన్ రూల్స్ మారిపోతే పరిస్థితి ఏంటనే సస్పెన్స్ మొదలవుతోంది. ప్రాసెస్ ఆలస్యమైతే క్లాసులకు హాజరుకావడమనేది అసాధ్యంగా మారుతుంది. ఇటు స్టూడెంట్స్‌కు వీసాల గ్యారెంటీ లేక, అటు యూనివర్సిటీలకు ఎంతమంది వచ్చి చేరతారో తెలీని అయోమయ పరిస్థితి ఏర్పడటంతో.. అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మెల్లగా తీవ్ర సంక్షోభంలోకి జారుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది.
Thermal Bill : థర్మల్ బిల్లుతో ఇంత ప్రమాదమా? ఆ ఉద్యోగులు డేంజర్లో ఉన్నారా?





