US Visa Rules : అమెరికా వెళ్లేవాళ్లకు బిగ్ షాక్.. చిన్న తప్పు చేసినా వీసా, గ్రీన్‌కార్డ్ అప్లికేషన్ క్షణాల్లో రిజెక్ట్..
US Visa Rules : గతంలో కొంతమంది అన్ని డాక్యుమెంట్లను యాడ్ చేయకుండానే అప్లికేషన్లు పైల్ చేసి, ఆ కేసు పెండింగ్‌లో ఉన్నంత కాలం కూడా వాటి లొసుగులను వాడుకుంటూ వర్క్ పర్మిషన్లు వంటి ఇతర ఇమ్మిగ్రేషన్ లాభాలు పొందేవాళ్లు.
US Visa Rules
అమెరికా వెళ్లాలని, అక్కడ జాబ్ లేదా ఎడ్యుకేషన్ పూర్తి చేసి స్థిరపడాలని కలలు కనే ప్రతీ ఒక్కరికీ యూఎస్ ప్రభుత్వం ఒక మైండ్ బ్లాకింగ్ షాక్ ఇచ్చింది. ఇమ్మిగ్రేషన్, వీసాలు, అలాగే గ్రీన్‌కార్డ్ అప్లికేషన్ విషయంలో యూఎస్ పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సర్వీసుల సంస్థ (యూఎస్సీఐఎస్) నిబంధనలను నెక్స్ట్ లెవెల్లో కఠినతరం చేస్తూ సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది.
ఇకపై అప్లై చేయాలనుకునే సమయంలో ఏ ఒక్క అవసరమైన పత్రం లేదా సరైన ప్రూఫ్ లేకపోయినా సరే.. దరఖాస్తుదారులకు ఎలాంటి ఎక్స్ట్రా టైమ్ ఇవ్వకుండా అప్లికేషన్‌ను స్పాట్లోనే రిజెక్ట్ చేసే తిరుగులేని అధికారాన్ని అధికారులకు కట్టబెట్టింది. ఈ కొత్త కండీషన్లు ఇమ్మీడియట్‌గా అమల్లోకి వస్తున్నట్లు వెల్లడించడంతో తమ డాలర్ డ్రీమ్స్ చెదిరిపోయ అవకాశం ఉందంటూ దరఖాస్తుదారులలో ఆందోళన రేగుతోంది.
సాధారణంగా గతంలో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు ఏవైనా పేపర్ మిస్ అయినా, లేదా మన అర్హతను పూర్తిగా ప్రూవ్ చేసుకోలేకపోయినా యూఎస్సీఐఎస్ అధికారులు రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ (ఆర్ఎఫ్ఈ) లేదా నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై (NOID) జారీ చేసేవారు. అంటే అప్లికేషన్‌ను వెంటనే తిరస్కరించకుండా .. ఏ పేపర్స్ తక్కువగా ఉన్నాయో తెలియజేసి, వాటిని సబ్మిట్ చేయడానికి కొంత టైమ్ ఇచ్చి రెండో అవకాశాన్ని కల్పించేవారు.
కానీ కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం ఆ అవకాశానికి పూర్తిగా చెక్ పడింది. మీరు ఇమ్మిగ్రేషన్‌కు అర్హులని అప్లికేషన్ పెడుతున్న రోజే పక్కాగా ప్రూవ్ చేసుకోవాలి. అన్ని ప్రూఫ్స్ సబ్మిట్ చేయకపోతే ఎక్స్ట్రా టైమ్ ఇవ్వడమనేది పూర్తిగా ఆ అధికారి మూడ్పైనో, విచక్షణాధికారంపైనో మాత్రమే ఆధారపడి ఉంటుంది తప్ప, రెండో అవకాశం దక్కుతుందన్న గ్యారంటీ లేదు.
గతంలో కొంతమంది అన్ని డాక్యుమెంట్లను యాడ్ చేయకుండానే అప్లికేషన్లు పైల్ చేసి, ఆ కేసు పెండింగ్‌లో ఉన్నంత కాలం కూడా వాటి లొసుగులను వాడుకుంటూ వర్క్ పర్మిషన్లు వంటి ఇతర ఇమ్మిగ్రేషన్ లాభాలు పొందేవాళ్లు. దీన్నే ప్లేస్‌హోల్డర్ దరఖాస్తులు అంటారు. దీనివల్ల నిబంధనలు సరిగ్గా పాటించే వారి జెన్యూన్ అప్లికేషన్లు కూడా ఆలస్యం అయ్యేవి.
ఇలాంటి లొసుగులకు చెక్ పెట్టడానికే యూఎస్సీఐఎస్ ఈ స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకుంది. గతంలో జో బైడెన్ హయాంలో అప్లికేషన్ అసంపూర్ణంగా ఉన్నా సరే వీలైనంతవరకు ఆధారాలు కోరాలని ఉన్న వెసులుబాటును ఇప్పుడు కేన్సిల్ చేశారు. ఈ కొత్త రూల్స్ ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్నవాటికి, అలాగే కొత్తగా వచ్చే అన్ని ఇమ్మిగ్రేషన్ అప్లికేషన్లకు కూడా వర్తించనున్నాయి.

అమెరికాకు విపరీతంగా అప్లై చేసే దేశాల్లో భారతదేశం టాప్‌లో ఉంటుంది కాబట్టి, ఇండియన్స్‌పై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. అందుకే స్టూడెంట్లు, ఉద్యోగులు, గ్రీన్‌కార్డ్ ఆశావాహులు తమ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ముందే.. ప్రతీ పేపర్‌ను ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా రీ-చెక్ చేసుకోవడం చాలా బెటర్.
అంతేకాదు ఈమధ్యే డ్యురేషన్ ఆఫ్ స్టేటస్ విధానాన్ని రద్దు చేసిన అమెరికా.. F-1 స్టూడెంట్ వీసా, J-1 ఎక్స్చేంజ్ విజిటర్లు, విదేశీ జర్నలిస్టుల I-వీసాల కాలాన్ని గరిష్టంగా నాలుగేళ్లకు మాత్రమే పరిమితం చేసింది. మొత్తానికి అమెరికా ఇమ్మిగ్రేషన్ రూల్స్ మెల్లమెల్లగా లూప్‌హోల్స్ లేకుండా చాలా క్లిష్టంగా మారుతున్నట్లు క్లియర్‌గా అర్థమవుతోంది.





