Just Andhra PradeshLatest News

AP : ఏపీలో భారీ రక్షణ రంగ ప్లాంట్..ఆ జిల్లాకు కొత్త గుర్తింపు

AP : దేశ రక్షణ రంగంలో దిగ్గజ సంస్థ అయిన భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ అగ్నేయస్త్ర ఎనర్జెటిక్స్ లిమిటెడ్, రాష్ట్రంలో తన మెగా ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది.

AP

ఆంధ్రప్రదేశ్ అనంతపురం లాంటి జిల్లా అంటే అందరికీ గుర్తుకువచ్చేది కియా కార్లు, హార్టికల్చర్ పండ్లు. అయితే ఇకపై ఇది అత్యాధునిక రక్షణ పరికరాల తయారీ కేంద్రంగా కూడా మారబోతోంది. దేశ రక్షణ రంగంలో దిగ్గజ సంస్థ అయిన భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ అగ్నేయస్త్ర ఎనర్జెటిక్స్ లిమిటెడ్, రాష్ట్రంలో తన మెగా ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. రూ. 2,400 కోట్ల భారీ పెట్టుబడితో రాబోతున్న ఈ ప్రాజెక్ట్, ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి ఒక బ్రహ్మాస్త్రం కానుంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న అనేక ప్రాంతీయ ఘర్షణలు, సరిహద్దు వివాదాల వల్ల మందుగుండు సామగ్రికి గ్లోబల్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ప్రపంచ సైనిక వ్యయం 2024లో రికార్డు స్థాయిలో $2.7 ట్రిలియన్లకు చేరింది. ముఖ్యంగా, యుద్ధాలకు అవసరమైన ఫిరంగి గుండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, అగ్నేయస్త్ర ఎనర్జెటిక్స్ ఈ అత్యాధునిక కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇది కేవలం దేశీయ అవసరాలకే కాకుండా, ప్రపంచానికి సరఫరా చేయడానికి ఒక గ్లోబల్ హబ్‌గా రూపుదిద్దుకోనుంది.

AP
AP

కొంతకాలంగా చర్చల దశలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇప్పుడు అధికారికంగా ఖరారైంది. భారత్ ఫోర్జ్ తన అనుబంధ సంస్థ అగ్నేయస్త్ర ఎనర్జెటిక్స్ లిమిటెడ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) తో భూమి కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) కు అధికారికంగా తెలియజేసింది. ఇలాంటి పెద్ద ఒప్పందాలను స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించడం అంటే, ప్రాజెక్ట్ ఇక ప్రారంభానికి సిద్ధంగా ఉందని స్పష్టమైన సంకేతంగా మారింది.

ap

ప్లాంట్ స్థలం.. శ్రీ సత్యసాయి జిల్లా, మడకశిర మండలం,భూమి విస్తీర్ణం..949.65 ఎకరాలు.ఈ ప్లాంట్‌లో క్షిపణులు, రాకెట్లు, ఫిరంగి గుండ్లతో పాటు అన్ని రకాల రక్షణ పదార్థాలు తయారు చేస్తారు. దీనివల్ల ఇకపై మన దేశ రక్షణ అవసరాల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గుతుంది. ఇది ప్రధాని మోదీ కలలుగన్న “ఆత్మనిర్భర్ భారత్” లక్ష్యానికి ఒక పెద్ద ప్రోత్సాహం.

ఆర్థికంగా వెనుకబడిన శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ భారీ ప్రాజెక్ట్ రావడం వల్ల సుమారు 550 మందికి పైగా యువతకు ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. అంతేకాకుండా, పరోక్షంగా వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించి స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది. మొత్తంగా అనంతపురం లాంటి జిల్లాలో ఈ రక్షణ రంగ ఫ్యాక్టరీ రావడం, పారిశ్రామికంగా, వ్యూహాత్మకంగా కూడా ఆంధ్రప్రదేశ్‌కు ఒక కొత్త గుర్తింపును తీసుకువస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Trump:మారుతున్న ట్రంప్ వైఖరి..మోదీపై సానుకూల వ్యాఖ్యలు దేనికి సంకేతం?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button