Cricketer Sricharani:క్రికెటర్ శ్రీచరణికి భారీ నజరానా..రూ. 2.5 కోట్లు, గ్రూప్ 1 జాబ్, ఇంకా..
Cricketer Sricharani: మహిళల క్రికెట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన శ్రీ చరణికి భారీ ప్రోత్సాహకాన్ని ప్రకటించారు.
Cricketer Sricharani
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ భేటీ (Cabinet Meeting)లో రాష్ట్ర క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళల క్రికెట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన శ్రీ చరణి(Cricketer Sricharani)కి భారీ ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఈ వివరాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు తెలిపారు.
మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకోవడంలో తన ఆటతీరుతో విశేష ప్రతిభ కనబరిచిన రాష్ట్రానికి చెందిన స్పిన్నర్ శ్రీ చరణికి బహుమతులు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది.
ఆమెకు ఏకంగా రూ. 2.5 కోట్ల (రెండున్నర కోట్ల) భారీ నగదు బహుమతిని ప్రకటించారు. విశాఖపట్నం (Vizag) వంటి కీలక నగరంలో 500 గజాల విలువైన ఇంటి స్థలం కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
శ్రీ చరణి(Cricketer Sricharani) తన గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఆమెకు నేరుగా గ్రూప్ 1 ఉద్యోగం (Group 1 Job) ఇచ్చే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

శ్రీ చరణి (Shree Charani) మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె ఆడిన తీరు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. శ్రీ చరణి ఇటీవల జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 మెగా వేలంలో కూడా సంచలనం సృష్టించారు.
ఆమె బేస్ ధర కేవలం రూ. 30 లక్షలు మాత్రమే.ఆమె కోసం ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో, చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు ఆమెను ఏకంగా రూ. 1.30 కోట్లకు (కోటి ముప్పై లక్షలకు) కొనుగోలు చేసింది.
అలాగే ఇటీవల మహిళల ప్రపంచ కప్‌ను (Women’s World Cup) గెలుచుకోవడంలో ఆమె తన ఆటతీరుతో విశేష ప్రతిభ కనబరిచారు. విజయం సాధించిన జట్టులో కీలక సభ్యురాలిగా శ్రీచరణి(Cricketer Sricharani) రాష్ట్రానికి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చారు.
ఈ విధంగా, ఆమె దేశం తరఫున ఆడి విజయం సాధించడంలో చూపిన ప్రతిభకు, అలాగే క్రికెట్ ప్రపంచంలో ఆమెకు దక్కిన గుర్తింపునకు సంతోషించిన ఏపీ ప్రభుత్వం ఈ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.



