Andhra Pradesh: ముంచుకొస్తున్న మొంథా.. ఏపీలోని పలు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్
Andhra Pradesh: తుపాను ప్రభావంతో సముద్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఒకవైపు భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల(Andhra Pradesh)న్నీ జలమయమయ్యాయి.
Andhra Pradesh
ఇప్పటికే ఎడతెరపి లేని వర్షాలతో గత రెండు మూడు నెలలుగా సతమతమవుతున్న ఏపీ(Andhra Pradesh)కి ఇప్పుడు తఫాను ముప్పు మరింత టెన్షన్ పెడుతోంది. మొంథా తుఫాను ప్రభావం పలు ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ తోనే గత నాలుగు రోజులుగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు మొంథా తుఫాను తీవ్రమవడంతో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు.
ప్రస్తుతం ఈ తుఫాను పశ్చిమ బంగాళాఖాతంలో వేగంగా కదులుతుంది. చెన్నైకి 520కి.మీ, విశాఖపట్నంకి 600 కి.మీ, కాకినాడకు 570 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఉగయానికి తీవ్రతుఫానుగా మారే అవకాశముందని పేర్కొంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం మంగళవారం రాత్రి కాకినాడ సమీపంలో తుపాను తీరం దాటుతుందని తెలుస్తోంది.
తుపాను ప్రభావంతో సముద్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఒకవైపు భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల(Andhra Pradesh)న్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస శిబిరాలకు తరలించారు. జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఏడు ఎన్డీఆర్ఎప్ బృందాలు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి.
తుఫాను ప్రభావం ఉన్న (Andhra Pradesh) జిల్లాల్లో అన్ని స్కూళ్ళు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దాదాపు అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు ఎవ్వరూ కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని హెచ్చరించారు. తుఫాను ప్రభావం రానున్న ఐదురోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే విశాఖ వాతావరణ శాఖ ప్రకటించింది.
ప్రస్తుతం కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే తూర్పుగోదావరి, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి,ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇంట్లోనే ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

మరోవైపు మొంథా తుఫాను ప్రభావంతో పలు రైళ్ళు రద్దయ్యాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని 43 రైళ్ల సర్వీసులను రద్దు చేశారు. రానున్న మూడు రోజుల్లోనూ పలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తుఫాను తీవ్రత తగ్గిన తర్వాత పరిస్థితి సమీక్షించి సర్వీసులను మళ్ళీ పునరుద్ధరిస్తామని రైల్వే శాఖ తెలిపింది. కాకినాడ తీరంలో తుఫాను తీరం దాటనుండటంతో… ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశాఖ రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రతీ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచారు. అదేవిధంగా.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, దువ్వాడ, రాయగడ స్టేషన్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు.



