Just BusinessLatest News

Gold :10 గ్రాములు బంగారం రూ.2 లక్షలు..ఎప్పటికో తెలుసా ?

Gold : ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ జెఫరీస్ ఈక్విటీ స్ట్రాటజీ సమీప భవిష్యత్తులో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవచ్చునని అంచనా వేసింది.

Gold

10 గ్రాముల బంగారం రూ.2 లక్షలు .. షాక్ అయ్యారా…అవును ఇది నిజం.. బంగారం ధర(Gold rate)పెరగడం ఇప్పట్లో ఆగేది లేదని క్లారిటీ వచ్చేసింది. మరో ఏడేళ్ళలో రూ.2 లక్షల రూపాయలకు చేరబోతోంది. అంటే ప్రస్తుతం ఉన్న ధరకు రెట్టింపు అన్నమాట… ఇప్పటికే రూ. 1.12 లక్షలకు చేరిపోగా.. ఇంకా పరుగులు పెడుతూనే ఉంది. ప్రస్తుతం ఉన్న రేటుకే మిడిల్ క్లాస్, ఇంకా కిందిస్థాయి వాళ్లు కొనలేక లబోదిబోమంటున్నారు. ఇప్పుడు వారి మైండ్ మరింత బ్లాంక్ అయ్యేలా తాజా రిపోర్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రపంచంలో పలు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో బంగారం ధర పెరిగిపోతూనే ఉంది. అమెరికా షేర్ మార్కెట్ తోనే చాలా వరకూ ఈ పరిస్థితులు ముడిపడిఉన్నాయన్నది తెలిసిందే. ఈ సమయంలో ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ జెఫరీస్ ఈక్విటీ స్ట్రాటజీ షాకింగ్ రిపోర్టును వెల్లడించింది.

ఆ సంస్థ గ్లోబల్ హెడ్ క్రిస్ వుడ్ బంగారం ధరల(Gold price)పై భారీ అంచనాలను వెల్లడించారు. సమీప భవిష్యత్తులో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవచ్చునని అంచనా వేశారు. ఈ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే ప్రస్తుత బుల్ రన్ కొనసాగితే ఫ్యూచర్ లో అమెరికాలో బంగారం ధర ఔన్సుకు 6,600 డాలర్లు దాటిపోతుందని అంచనా. దీని ప్రకారం అక్కడ ఒక ఔన్సు గోల్డ్ 6,600 డాలర్లకు చేరుతుంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 5,81,205 లక్షలన్నమాట. ఒక ఔన్సు బంగారం 28.3495 గ్రాములు అయితే గ్రాము ధర సుమారు రూ.20,500గా ఉంటుంది. 10 గ్రాముల ధర రూ.2,05,000కు పెరుగుతుంది. అదేగానీ జరిగితే భారతీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అప్పుడు తులం బంగారం ధర రూ. 2 లక్షలు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Gold
Gold

జెఫరీస్ ఈక్విటీ గ్లోబల్ హెడ్ గా ఉన్న క్రిస్ వుడ్ గత 20 ఏళ్లలో బంగారం ధరలపై వేసిన అంచనాలు నిజమయ్యాయి. 2002లో 3,400 డాలర్లు, 2005లో 3,700 డాలర్లు, 2016లో 4,200 డాలర్లు, 2020లో 5,500 డాలర్లు కాగా ఇప్పుడు 6,600 డాలర్లతో ఆయన వేసిన అంచనా అందరినీ షాకింగ్ కు గురి చేస్తోంది. 1980లో బంగారం ధర ఔన్సుకు 850 డాలర్లు భారత కరెన్సీలో సుమారు రూ. 70,550గా పలికింది. అమెరికాలో పెరుగుతున్న తలసరి ఆదాయం ప్రకారం క్రిస్ వేసిన అంచనా అప్పుడు నిజమైంది.

మరోవైపు మన దేశంలో గత పదేళ్లుగా బంగారం ధర విపరీతంగా పెరుగుతూనే ఉంది. 2015లో 24 క్యారెట్ల బంగారం ధర 24 వేల వరకూ ఉంటే… 2020కి అది రెట్టింపై 50 వేలకు చేరింది. ఇప్పుడు 2025కు మరోసారి రెట్టింపయింది. ప్రస్తుతం భారత్‌లో 10 గ్రాముల ధర రూ.1,12,000 వద్ద కొనసాగుతుండగా… క్రిస్ వుడ్ వేసిన అంచనాతో అమెరికాలో ఔన్స్ గోల్డ్ 6,600 డాలర్లకు చేరితే మాత్రం మన దేశ బులియన్ మార్కెట్ పై తీవ్రంగా ప్రభావం పడుతుందని తెలుస్తోంది. అప్పుడు ఇండియాలో కూడా 10 గ్రాములు ఈజీగా 2 లక్షలు దాటిపోతుంది. క్రిస్ వుడ్ అంచనాతో పెట్టుబడిదారుల్లో బంగారంపై మరింత ఆసక్తి కనిపిస్తోంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button