Just BusinessLatest News

Gold Buyers: బంగారం కొనేవారికి భారీ షాక్.. ఒక్కరోజే సుమారు రూ.2 వేలు పెరిగిన గోల్డ్ రేట్..

Gold Buyers: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలకమైన వడ్డీ రేట్లను మరోసారి తగ్గించడంతో.. బంగారం ధర భారీగా పెరిగింది.

Gold Buyers

బంగారం ధరలు కొనుగోలు దారుల(Gold Buyers)కు షాక్ ఇవ్వడానికే ఫిక్స్ అయ్యాయి అన్నట్లుగా పెరుగుతున్నాయి. రోజురోజుకు బంగారం సామాన్యుడికి అందని ద్రాక్షలా మిగిలిపోతుంది. బంగారం కొనాలన్న కోరిక..అలాగే ఉండిపోతుందా అన్న అనుమానాలను కలిగిస్తుంది.

తాజాగా పసిడి ప్రియులకు (Gold Lovers) మరోసారి పెద్ద షాక్ తగిలింది. అంతా ఊహించినట్లుగానే, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ (US Federal Reserve) కీలకమైన వడ్డీ రేట్లను (Interest Rates) మరోసారి తగ్గించడంతో.. బంగారం ధర భారీగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు ఊగిసలాటలకు (Fluctuations) గురవుతూ సాధారణ వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Gold Buyers
Gold Buyers

డిసెంబర్ 12 ఉదయం మార్కెట్లో నమోదైన బులియన్ ధరలు (Bullion Prices) చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ. 1,910 పెరిగింది. అంటే దాదాపు రూ. 2,000 వరకు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,32,660 కి చేరుకుంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 1,750 పెరిగి, ప్రస్తుతం రూ. 1,21,600 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో తులం (10 గ్రాములు) బంగారం ధర రూ. 1,32,600 వద్ద కొనసాగుతోంది.

బంగారంతో పాటు వెండి (Silver) ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండిపై ఏకంగా రూ. 3,000 వరకు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 2,04,000 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్, చెన్నై, కేరళ వంటి ప్రాంతాల్లో కిలో వెండి ధర మరింత అధికంగా రూ. 2,15,000 వద్ద ఉంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button