Just BusinessLatest News

Gold prices: గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ ఛాన్స్..మళ్లీ తగ్గుతున్న బంగారం ధరలు

Gold prices: ఉదయం మార్కెట్లు ప్రారంభం కాగానే ఈ తగ్గుదల కనిపించడం పసిడి కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది.

Gold prices

కొంతకాలంగా ఊగిసలాడుతున్న భారతీయ బులియన్ మార్కెట్‌లో, నవంబర్ 24, సోమవారం నాడు పసిడి ప్రియులకు నిజంగా శుభవార్త అందింది. స్థిరత్వం లేకుండా క్షణక్షణం మారుతూ, పెరిగినట్టే పెరిగి ఒక్కసారిగా పడిపోతున్న బంగారం ధరలు (gold prices)ఈరోజు భారీ తగ్గుదలను నమోదు చేశాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభం కాగానే ఈ తగ్గుదల కనిపించడం పసిడి కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది.

వివిధ క్యారెట్లపై తగ్గిన మొత్తం వివరాలు..ఈరోజు నమోదైన ధరల సవరణలో, ప్రతి క్యారెట్ బంగారంపై గణనీయమైన తగ్గుదల కనిపించింది.

  • 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముపై ఏకంగా రూ. 71 మేర తగ్గింది.
  • 22 క్యారెట్ల బంగారంఒక గ్రాముపై రూ. 65 మేర దిగివచ్చింది.
  • 18 క్యారెట్ల బంగారం(Gold prices )ఒక గ్రాముపై రూ. 53 తగ్గి, కొనుగోలుదారులకు అనుకూలమైన ధరలను సూచించింది.
Gold prices
Gold prices

ఈ ధరల పతనం తర్వాత, దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల పసిడి ధరలు ఈ కింది విధంగా స్థిరపడ్డాయి

  • 24 క్యారెట్స్ (ప్యూర్ గోల్డ్) రూ. 1,25,130
  • 22 క్యారెట్స్ (నగల తయారీకి) రూ. 1,14,700
  • 18 క్యారెట్స్ రూ. 93,850

పసిడి బాటలోనే వెండి కూడా ప్రయాణించింది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ప్రతి గ్రాముపై ఒక రూపాయి తగ్గుదల నమోదు కావడంతో, కిలో వెండి ధర రూ. 1,71,000 వద్ద పలుకుతోంది. గ్రాము వెండి ధర రూ. 171 గా ఉంది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ప్రధాన నగరాల్లో ఈ ధరల ట్రెండ్‌లు సోమవారం ప్రతిఫలించాయి. ఈ తగ్గిన ధరలు గోల్డ్ లవర్స్‌కి ఇది ఒక మంచి పెట్టుబడి అవకాశంగా చెప్పొచ్చు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button