Gold:దసరా నవరాత్రులలో షాకిచ్చిన బంగారం ధరలు..
Gold: రాబోయే రోజుల్లో కూడా గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Gold
బంగారం ధరలు రోజుకో కొత్త రికార్డును బద్దలు కొడుతున్నాయి. ఈ ధరల వల్ల సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకే కాదు, ఒక మోస్తరు ఆదాయం ఉన్న వారికి కూడా బంగారం అందని ద్రాక్షలా మారిపోతోంది. భారతదేశంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలన్నింటిలోనూ బంగారం(Gold) కొనుగోలు చేయడం అనేది తప్పనిసరి. ఇలాంటి సమయంలో, తులం (10 గ్రాములు) బంగారం ధర ఏకంగా లక్ష 16 వేలు దాటడంతో, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం చాలా మందికి కష్టంగా మారింది.

బంగారం(Gold) ధరలు ఇంత భారీగా పెరగడానికి ముఖ్య కారణం పెట్టుబడులు పెరగడం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం (Inflation) భయాల కారణంగా, సురక్షితమైన పెట్టుబడిగా భావించే గోల్డ్‌పై పెట్టుబడులు ఎక్కువ కావడం ధరల పెరుగుదలకు దారితీసింది. అయితే, రాబోయే రోజుల్లో కూడా గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిస్థితులలో బంగారం రోజురోజుకు పెరుగుతుండటం, పసిడి ప్రియులకు మరింత ఆందోళన కలిగిస్తోంది.
బంగారం(Gold) బాటలోనే వెండి ధరలు కూడా కొనసాగుతున్నాయి. ఈ రెండు విలువైన లోహాల ధరలు తాజాగా సరికొత్త రికార్డులను తిరగరాశాయి. తాజాగా సోమవారం మార్కెట్ ప్రారంభంలోనే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
దేశీయంగా, తెలుగు రాష్ట్రాల్లో తాజా ధరల వివరాలు (సోమవారం)
దేశీయ బులియన్ మార్కెట్ ప్రకారం, తాజాగా బంగారం, వెండి ధరలు కింది విధంగా ఉన్నాయి:
లోహం రకం పెరిగిన ధర (రూ.) తాజా ధర (10 గ్రాములు/కిలో)
బంగారం 24 క్యారెట్లు (10 గ్రాములు) రూ.920 రూ.1,16,400
బంగారం 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 850 రూ.1,06,700
వెండి కిలో రూ.1,000 రూ.1,50,000
తెలుగు రాష్ట్రాల్లో ధరలు:
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో కూడా ధరలు అదేవిధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ1,16,400
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,06,700
కిలో వెండి: రూ.1,60,000
భారతదేశంలో బంగారం ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, రాష్ట్ర పన్నులు, తయారీ ఛార్జీలు వంటి అంశాలను బట్టి ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి.