Just BusinessLatest News

Gold :పసిడి ప్రియులకు అదిరే శుభవార్త..భారీగా ధరలు డౌన్!

Gold: దీపావళి కొనుగోళ్ల తర్వాత దేశీయ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా పతనమవుతున్నాయి.

Gold

పసిడి(Gold) ప్రియులకు ఇది నిజంగానే మంచి అవకాశం అని చెప్పొచ్చు. కొన్ని రోజులుగా రికార్డు గరిష్ఠాలకు చేరిన బంగారం ధరల్లో భారీ దిద్దుబాటు (Correction) కొనసాగుతోంది. ముఖ్యంగా దీపావళి కొనుగోళ్ల తర్వాత దేశీయ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా పతనమవుతున్నాయి.

భారీగా పడిపోయిన బంగారం(Gold) ధర.. అంతర్జాతీయ మార్కెట్లో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగుతున్న క్రమంలో బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. డాలర్ పుంజుకోవడం కూడా బంగారం దిగివచ్చేందుకు ఒక కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

క్రితం రోజుతో పోలిస్తే ఈరోజు (అక్టోబర్ 23, గురువారం) స్వచ్ఛమైన గోల్డ్ (24 క్యారెట్లు) రేటు తులానికి ఏకంగా రూ.4,690 మేర పడిపోయింది. గత వారం రోజుల్లో చూసుకుంటే తులం బంగారంపై దాదాపు రూ.7,000 మేర తగ్గింది.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు కుప్పకూలాయి.
24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములు (తులం) రూ. 4,690 రూ. 1,25,890
22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాములు (తులం) రూ. 4,300 రూ. 1,15,400

Gold
Gold

వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. వారం రోజుల క్రితం వరకు రాకెట్ వేగంతో దూసుకెళ్లిన వెండి రేటు, ఇప్పుడు అదే స్థాయిలో దిగివస్తోంది. ఈరోజు కిలో వెండి రేటు రూ.4,000 మేర పడిపోయింది. వారం రోజుల్లో వరుసగా తగ్గుతూ ఏకంగా రూ.32,000 మేర దిగివచ్చింది.

ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ. 1,75,000 వద్ద ట్రేడవుతోంది. (ఢిల్లీ, ముంబైలలో రూ.1,60,000 స్థాయికి దిగివచ్చింది). అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు (31 గ్రాములు) 8 డాలర్లకు పైగా పడిపోవడంతో, ఔన్స్ గోల్డ్ రేటు $4089 స్థాయికి దిగివచ్చింది. ప్రాఫిట్ బుకింగ్ వల్ల ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button