Gold Lovers:గోల్డ్ లవర్స్‌కు అదిరిపోయే వార్త.. రికార్డు స్థాయిలో పడిపోయిన బంగారం, వెండి ధరలు..
Gold Lovers: బంగారం కంటే వెండి ధరలు ఈ రోజు మరీ భారీగా కుప్పకూలడం మార్కెట్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Gold Lovers
దేశీయ మార్కెట్‌లో కొద్ది రోజులుగా పరుగులు తీస్తున్న బంగారం, వెండి ధరలు నిన్నటి నుంచి కాస్త డౌన్ అయిన ధరలు ఈరోజు అయితే ఊహించని విధంగా భారీగా పతనమయ్యాయి. కొంతకాలంగా ఆకాశాన్నంటుతున్న ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడటంతో కొనుగోలుదారులు(Gold Lovers )హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. ఈ రోజు ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ. 8,620 తగ్గి రూ. 1,60,580 వద్ద ట్రేడ్ అవుతోంది.
అదేవిధంగా ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 7,900 తగ్గి రూ. 1,47,200కు చేరుకుంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ. 6,460 తగ్గి రూ. 1,20,440గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. అక్కడ 24 క్యారెట్ల బంగారం రూ. 1,60,730గా ఉండగా, ముంబైలో మాత్రం హైదరాబాద్ ధరలతో సమానంగా రూ. 1,60,580 వద్ద కొనసాగుతోంది.
బంగారం కంటే వెండి ధరలు ఈ రోజు మరీ భారీగా కుప్పకూలడం మార్కెట్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర ఏకంగా రూ. 55,000 తగ్గి రూ. 3,50,000కు చేరుకుంది. ఢిల్లీలో కిలో వెండి రూ. 45,000 తగ్గి.. రూ. 3,50,000 వద్దే ఉంది. ముంబైలోనూ ఇదే స్థాయిలో ధరలు స్థిరంగా ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న సమయంలో ఈ స్థాయిలో ధరలు తగ్గడం కొనుగోలుదారులకు పెద్ద అవకాశమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం..అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువ పెరగడం, బాండ్ ఈల్డ్స్‌లో వస్తున్న మార్పుల వల్ల ఇన్వెస్టర్లు బంగారం నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు బడ్జెట్‌లో మోదీ సర్కార్ దిగుమతి సుంకాలపై తీసుకోబోతున్న నిర్ణయాలు కూడా దేశీయంగా ధరలు తగ్గడానికి కారణమవొచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే ఇది తాత్కాలిక తగ్గుదల మాత్రమేనా లేక మరికొద్ది రోజులు ఇలాగే కొనసాగుతుందా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా బంగారం కొనాలనుకునే వారికి మాత్రం ఇది ఒక గొప్ప అవకాశమని చెప్పొచ్చు. త్వరలోనే మరిన్ని మార్పులొచ్చే అవకాశం ఉండటంతో.. కొనుగోలుదారులు(Gold Lovers) ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని గమనిస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.



