Psychology:అతను అబద్ధం చెబుతున్నాడా? మీ నుంచి ఏదో దాస్తున్నాడా? ఇలా కనిపెట్టండి!
Psychology: సైకాలజీ ప్రకారం అబద్ధం చెప్పేటప్పుడు ఆ మనిషి శరీరం వారికి సహకరించదట.
Psychology
ప్రేమలో అయినా పెళ్లిలో అయినా నమ్మకమే పునాది. అయితే చిన్న అబద్ధం ఆ పునాదిని కూల్చే పెద్ద ఆయుధం. చాలామంది అబ్బాయిలు తమను ఇష్టపడే అమ్మాయికి అబద్ధాలు చెబుతూ, వేరే వాళ్లతో సన్నిహితంగా ఉంటారు. అయితే, వారు ఎంత తెలివిగా దాచాలని చూసినా.. వారి ప్రవర్తనలో, మాటల్లో కొన్ని మార్పులు కచ్చితంగా చోటుచేసుకుంటాయట. సైకాలజీ (Psychology) ప్రకారం అబద్ధం చెప్పే వ్యక్తిని పట్టుకోవడానికి కొన్ని స్పష్టమైన సంకేతాలు ఉంటాయట.
కొంతమంది మీరు అడగకపోయినా వారు ఎక్కడికి వెళ్లారు, ఎవరిని కలిశారనే విషయాలను కథలు కథలుగా వివరిస్తుంటారు. లేదంటే దీనికి భిన్నంగా అడిగినా కూడా ఆ ప్రశ్నను దాటవేయడం లేదంటే చెప్పీచెప్పకుండా చెప్పడం చేస్తుంటారు. ఇలాంటి వారిని కచ్చితంగా అనుమానించాల్సిందేనట.
మీరు ఏదైనా కొంచెం అనుమానంతో అడిగితే, వారు వెంటనే కోప్పడటం లేదా నన్ను అనుమానిస్తున్నావా? అని మీ మీదకే తిరగబడటం చేస్తారు. సైకాలజీ(Psychology) ప్రకారం, దీన్ని ‘డిఫెన్సివ్ బిహేవియర్’ అంటారు. అబద్ధం దొరికిపోతుందనే భయం ఉన్నప్పుడే మనిషిలో కోపం, చిరాకు ఎక్కువగా వస్తుంటాయి.
బాడీ లాంగ్వేజ్ మారుతుంది. అంటే సైకాలజీ ప్రకారం అబద్ధం చెప్పేటప్పుడు ఆ మనిషి శరీరం వారికి సహకరించదట.
కళ్లలోకి చూడలేకపోవడం.. సాధారణంగా కళ్లు కలిపి మాట్లాడలేరు, లేదా అతిగా కళ్లు కదిలిస్తుంటారు.
ముక్కు లేదా గొంతు తాకడం.. అబద్ధం చెప్పేటప్పుడు కలిగే ఆందోళన వల్ల రక్తపోటు పెరిగి ముక్కు లేదా గొంతు వద్ద దురదగా అనిపిస్తుంది. అందుకే వారు తరచుగా ముఖాన్ని తాకుతుంటారు.
దూరం పెంచడం.. మీతో మాట్లాడేటప్పుడు మధ్యలో దిండు పెట్టుకోవడం లేదా వెనక్కి జరగడం వంటివి చేస్తారు. అంటే మానసిక దూరంతో పాటు భౌతిక దూరాన్ని కూడా చూపిస్తారన్నమాట.
అంతేకాదు ఇంతకుముందు ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పడేసే వ్యక్తి, సడన్గా పాస్వర్డ్లు మార్చడం, ఫోన్ను ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకోవడం, మీరు ఫోన్ తీసుకుంటే కంగారు పడటం వంటివి చేస్తే.. ఏదో దాస్తున్నారనే అర్థం. నోటిఫికేషన్లు వస్తున్నాయని ఫోన్ స్క్రీన్ తిరగేయడం కూడా దీనికి పెద్ద హింట్ అంటారు సైకాలజిస్టులు.

ముఖ్యంగా వీరు సాధారణంగా ఇలాంటి అబద్ధాలు చెబుతుంటారు.ఆ అమ్మాయి నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అంటారు. కానీ ఆమెతో నిరంతరం చాటింగ్ కొనసాగిస్తూనే ఉంటారు.
ఆఫీస్ పనిలో చాలా బిజీగా ఉన్నాను అని చెబుతారు. కానీ కాస్త సమయం దొరికినా ఆసమయంలో వేరే వాళ్లతో టైమ్ స్పెండ్ చేస్తుంటారు.
ఫోన్ సైలెంట్లో ఉంది, మీటింగ్లో ఉన్నాను, నీ కాల్ చూడలేదు అని అంటారు. కానీ వారు అప్పుడు ఫోన్ రింగ్ అవడం చూస్తారు.
అయితే, ఈ సంకేతాలను గమనించిన వెంటనే అనుమానంతో బంధాన్ని చిన్నాభిన్నం చేసుకునే కంటే, ఎదురుగా కూర్చోబెట్టి డైరక్టుగా మాట్లాడటం అన్నిటికంటే మంచిది. మీ మనసులో ఉన్న సందేహాలను, మీరు గమనించిన మార్పులను వారికి ప్రశాంతంగా అతనికి వివరించండి.దీంతో పశ్చాత్తాపంతో తిరిగి ఎప్పటిలాగే ఉండటానికి ప్రయత్నిస్తారు.
కానీ వారు నిజాన్ని ఒప్పుకోకుండా, మిమ్మల్ని తక్కువ చేస్తూ మాట్లాడితే.. అప్పుడు మీరు ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అబద్ధాల మీద నిలబడే బంధం ఎప్పటికైనా కూలిపోవాల్సిందే. వారి మనసు మార్చడానికి ఒక అవకాశం ఇచ్చి చూడండి, కానీ మీ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి మాత్రం కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. నిజాయితీ లేని చోట బంధానికి చెక్ పెట్టి, ప్రశాంతంగా ముందుకు సాగడమే మీ మానసిక ఆరోగ్యానికి మంచిదని సైకాలజిస్టులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి



