Social Media: సామాన్యులు కూడా సోషల్ మీడియాలో డబ్బు సంపాదించడం ఎలా?
Social Media: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చేసే 'ఇన్ ఫ్లుయెన్సర్లు' (Influencers) నెలకు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నారు.
Social Media
సోషల్ మీడియా(Social Media)అనేది ఒకప్పుడు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అది ఒక భారీ పరిశ్రమగా మారింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చేసే ‘ఇన్ ఫ్లుయెన్సర్లు’ (Influencers) నెలకు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నారు.
ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి ఏడాది మొత్తం ఎంతో కష్టపడి సంపాదించే మనీని.. ఒక పాపులర్ ఇన్ ఫ్లుయెన్సర్(Social Media)కేవలం ఒకే ఒక్క బ్రాండ్ ప్రమోషన్ వీడియో ద్వారా ఈజీగా సంపాదిస్తున్నాడు. ఈ సంపాదన మార్గాలు కేవలం యాడ్స్ కే పరిమితం కాకుండా, అఫిలియేట్ మార్కెటింగ్, బ్రాండ్ కొలాబరేషన్స్, పర్సనల్ బ్రాండింగ్ ద్వారా సాగుతున్నాయి.
అయితే ఒక సామాన్యుడు దీని ద్వారా ఎలా డబ్బు సంపాదించవచ్చో అన్న విషయంలో చాలామందికి అవగాహన ఉండదు. ఇన్ ఫ్లుయెన్సర్ అవ్వడానికి లక్షల మంది ఫాలోవర్లు ఉండాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా ఒక అంశంపై పట్టు ఉంటే (ఉదాహరణకు వంటలు, టెక్నాలజీ, ఫైనాన్స్ లేదా జోక్స్, టూరిజం) దానిపై కంటెన్యూగా వీడియోలు చేయడం మొదలుపెట్టాలి. దానిని యూ ట్యూబ్‌లో, ఇన్ స్టాలోనే రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉండాలి.

మీ కంటెంట్‌లో నిజాయితీ ఉండి, జనాలు దాన్ని ఇష్టపడితే బ్రాండ్స్ తమంతట తామే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఒక వెయ్యి మంది ఫాలోవర్లు ఉన్న వారు కూడా ‘నానో ఇన్ ఫ్లుయెన్సర్’ గా మారి నెలకు 10 నుంచి 20 వేల వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు.
అయితే, ఈ రంగంలో విజయానికి ముఖ్యమైనది ‘స్థిరత్వం’ (Consistency). మొదటి రోజో, మొదటి వారమో, మొదటి నెలో ఇలా వెంటనే రిజల్ట్ రాదు. కానీ ప్రతిరోజూ నాణ్యమైన కంటెంట్ అందిస్తూ ఉంటే, ఆరు నెలల కాలంలోనే ఒక మంచి ఆదాయ మార్గాన్ని క్రియేట్ చేసుకోవచ్చు.
ఏ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇవ్వలేనంత స్వేచ్ఛ , ఆదాయం సోషల్ మీడియా(Social Media)ఇస్తుంది. మీకు కావాల్సిందల్లా ఒక స్మార్ట్‌ఫోన్ ,ఒక వినూత్నమైన ఆలోచన మాత్రమే. 2026లో డిజిటల్ మార్కెటింగ్ బడ్జెట్లు మరింత పెరుగుతున్నాయి కాబట్టి, ఇప్పుడు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇదే రైట్ టైమ్. సో కావాల్సినంత ఇంట్రస్ట్ ఉంటే చాలు వెంటనే ఎంటర్ అయిపోండి..



