Just BusinessJust LifestyleLatest News

India’s most-ordered dish: నిమిషానికి 200 ఆర్డర్లు.. పదో ఏటా బిర్యానీనే టాప్

India’s most-ordered dish: దీంట్లో అత్యధికంగా ఆర్డర్ వచ్చిన వంటకం బిర్యానీ(India’s most-ordered dish)నే. స్విగ్గీ గణాంకాల ప్రకారం నిమిషానికి 200 బిర్యానీలు ఆర్డర్స్ వచ్చాయి.

India’s most-ordered dish

రెస్టారెంట్స్ ఫుడ్స్ లో బిర్యానీ(India’s most-ordered dish)కి ఉన్న ఫాలోయింగ్ మరే వంటకానికి లేదనే చెప్పాలి. ఎందుకంటే బిర్యానీని ఇష్టపడని వారు దాదాపుగా ఉండరు. ముఖ్యంగా హైదరాబాద్ ధమ్ బిర్యానీ అంటే ఎవరైనా లొట్టలేయాల్సిందే. దేశవ్యాప్తంగా బిర్యానీకి ఉన్న క్రేజ్ ఏంటనేది మరోసారి రుజువైంది. తాజాగా ఫుడ్ యాప్ సంస్థ స్విగ్గి తమ వార్షిక నివేదికను విడుదల చేసింది.

దీంట్లో అత్యధికంగా ఆర్డర్ వచ్చిన వంటకం బిర్యానీ(India’s most-ordered dish)నే. స్విగ్గీ గణాంకాల ప్రకారం నిమిషానికి 200 బిర్యానీలు ఆర్డర్స్ వచ్చాయి. అంటే 3.25 సెకన్లకు ఒక బిర్యానీ ఆర్డర్ చేసారని తెలుస్తోంది. ఏడాది మొత్తం మీద 9 కోట్లకు పైగా ఆర్డర్లతో బిర్యానీ టాప్ ప్లేస్ లో నిలిచింది. దీనిలో చికెన్ బిర్యానీ అగ్రస్థానంలో నిలిచిందని రిపోర్టు పేర్కొంది. ఘుమఘుమలాడే మసాల దినుసులతో తయారయ్యే చికెన్ బిర్యానీనే ఎక్కువమంది ఆర్డర్ చేసారని వెల్లడించింది.

India’s most-ordered dish (1)
India’s most-ordered dish (1)

చికెన్ బిర్యానీ ఆర్డర్ల సంఖ్య 5.77 కోట్లుగా నమోదైంది. కాగా గత పదేళ్ళుగా ఈ జాబితాలో బిర్యానీనే టాప్ ప్లేస్ లో నిలుస్తోంది. లంచ్ టైమ్ లో కంటే డిన్నర్ టైమ్ లోనే ఎక్కువ ఆర్డర్స్ వచ్చినట్టు గుర్తించారు. ఇదిలా ఉంటే బిర్యానీ తర్వాతి ప్లేస్ కోసం కూడా గట్టిపోటీ నడిచింది. బిర్యానీ తర్వాత అత్యధికంగా ఆర్డర్ దక్కించుకున్నది బర్గర్… ఫాస్ట్ ఫుడ్స్ లో క్రేజ్ ఉన్న బర్గర్ కు 4.42 కోట్ల ఆర్డర్స్ వచ్చాయని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. బర్గర్ తర్వాత 4.01 కోట్ల ఆర్డర్లతో పిజ్జా మూడో స్థానంలో ఉంది. ఇక దోశ 2.62 కోట్ల ఆర్డర్లతో నాలుగో స్థానంలో నిలిచిందని రిపోర్టు చెబుతోంది.

వరుసగా పదో ఏడాది కూడా బిర్యానీనే టాప్ ప్లేస్ లో నిలవడంపై స్విగ్గీ మార్కెట్‌ప్లేస్ సీఈఓ రోహిత్ కపూర్ స్పందించారు. బిర్యానీ కేవలం ఫుడ్ మాత్రమే కాదనీ, అది భారతీయులందరికీ ఒక ఎమోషన్ అంటూ చెప్పుకొచ్చారు. ఏదైనా విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలన్నా, అర్థరాత్రి ఆకలి వేసినా భారతీయులు బిర్యానీకే ప్రాధాన్యతనిస్తారని వ్యాఖ్యానించారు. కాగా చాలా ప్రాంతాల్లో గతంతో పోలిస్తే ఆర్డర్లు పెరిగాయని తెలిపారు. ఇదిలా ఉంటే బిర్యానీ ఆర్డర్లను జొమాటో , రెస్టారెెంట్లకు వెళ్లి తినేవారిని కూడా లెక్కిస్తే సరికొత్త రికార్డు నెలకొల్పడం ఖాయమని భావిస్తున్నారు.

Dum Biryani: హైదరాబాదీ దమ్ బిర్యానీ రెండు రకాలని తెలుసా? పోనీ వాటిని ఎలా చేస్తారో తెలుసా?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button