Buy Gold: బంగారం కొనాలనుకున్నవారికి ఇదే మంచి సమయం.. ఎందుకంటే?
Buy Gold: వచ్చే ఏడాది అంటే 2026 ప్రారంభంలో బంగారం ,వెండి రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి 2025 సంవత్సరం బంగారం చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది.
Buy Gold
రెండు రోజులుగా చూస్తుంటే మార్కెట్లో బంగారం ధరలు (Buy Gold)పెద్దగా మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. అటు వెండి ధరల్లో కూడా ఇవాళ ఎలాంటి మార్పు కనిపించలేదు. అయితే ఈ స్థిరత్వం ఎంతో కాలం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వచ్చే ఏడాది అంటే 2026 ప్రారంభంలో బంగారం(Buy Gold), వెండి రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి 2025 సంవత్సరం బంగారం చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ ఏడాది మొదట్లో 10 గ్రాముల బంగారం ధర సుమారు 80 వేల రూపాయల దగ్గర ఉండగా ఇప్పుడు అది ఏకంగా ఒక లక్షా 30 వేల రూపాయలకు చేరింది. అంటే ఈ ఒక్క ఏడాదిలోనే బంగారం ఎంతలా పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ , విశాఖపట్నంలో ఇవాళ బంగారం ధరలు(Buy Gold) ఇలా ఉన్నాయి. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక లక్షా 23 వేల 600 రూపాయలుగా ఉంది. అలాగే 24 క్యారట్ల బంగారం ధర ఒక లక్షా 34 వేల 840 రూపాయలకు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 22 క్యారట్ల బంగారం ఒక లక్షా 23 వేల 750 రూపాయలు ఉండగా 24 క్యారట్ల ధర ఒక లక్షా 34 వేల 990 రూపాయలుగా ఉంది. ముంబై, బెంగళూరు మరియు చెన్నై వంటి నగరాల్లో కూడా హైదరాబాద్ ధరలే కొనసాగుతున్నాయి.
వెండి విషయానికి వస్తే హైదరాబాద్ , ఏపీలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర 2 లక్షల 26 వేల రూపాయల వద్ద స్థిరంగా ఉంది. కానీ ఢిల్లీ , ముంబై వంటి నగరాల్లో కిలో వెండి ధర 2 లక్షల 14 వేల రూపాయలుగా ఉంది. అంతర్జాతీయంగా జరుగుతున్న కొన్ని ఆర్థిక మార్పుల వల్ల రాబోయే జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కాబట్టి పెళ్లిళ్లు లేదా ఇతర శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునే వారు ఈ స్థిరమైన ధరలను ఉపయోగించుకోవడం మంచిది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ ధరలు కేవలం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. రోజులో పరిస్థితులను బట్టి ఇవి మారుతూ ఉంటాయి.



