Today Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం ధరలు .. ఈరోజు ఎంత తగ్గిందంటే..
Today Gold Rate: నిన్న భారీగా పెరిగిన బంగారం ధర, ఈ రోజు ఉదయానికి అనూహ్యంగా భారీగా తగ్గుముఖం పట్టింది.
Today Gold Rate
దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు కొద్ది రోజులుగా అప్ అండ్ డౌన్స్‌తో కొనుగోలుదారులను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. నిన్న భారీగా పెరిగిన బంగారం ధర, ఈ రోజు ఉదయానికి అనూహ్యంగా భారీగా తగ్గుముఖం పట్టింది. 10 గ్రాముల బంగారం ధర(Today Gold Rate)పై ఏకంగా రూ. 800 వరకు దిగి వచ్చింది. ప్రస్తుతం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,27,850 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,17,200 వద్ద ఉంది.
హైదరాబాద్ , విజయవాడలలో తులం (10 గ్రాములు) బంగారం ధర(Today Gold Rate) రూ. 1,27,850 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ధర రూ. 1,28,000 ఉండగా, ముంబైలో రూ. 1,27,850 వద్ద నమోదైంది.

వెండి (Silver) విషయానికి వస్తే, కిలో వెండి ధర అతి స్వల్పంగా రూ. 100 పెరిగి ప్రస్తుతం రూ. 1,73,100 వద్ద కొనసాగుతోంది. అయితే, నిన్నటి ట్రేడింగ్‌లో వెండి ధర ఏకంగా రూ. 10 వేల వరకు భారీగా పెరిగింది.

బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువ (Dollar Value) బలపడటం. డాలర్ విలువ పెరిగే కొద్దీ, పెట్టుబడిదారులు అధిక రాబడి కోసం అమెరికా ఫెడరల్ రిజర్వ్ జారీ చేసే ట్రెజరీ బాండ్లపై పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతారు.
ఫలితంగా, అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ తగ్గి, ధరలు దిగి వస్తాయి. డాలర్, బంగారం ధరల మధ్య ఉన్న ఈ విలోమ సంబంధం (Inverse Relationship) కారణంగానే ఈ రోజు బంగారం ధరల్లో ఈ తగ్గుదల కనిపించిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.



