Gold :మార్కెట్‌ను మండించిన ట్రంప్ ప్రకటన..బంగారం,వెండి ధరలకు మళ్లీ రెక్కలు
Gold :అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో తగ్గిన పసిడి ధర, ట్రంప్ ప్రకటనతో మళ్లీ భారీగా పెరిగి, ఆల్ టైమ్ రికార్డు స్థాయిని నమోదు చేసింది.

Gold
బంగారం(Gold),వెండిపై పెట్టుబడి పెట్టేవారికి శుక్రవారం కొంత ఉపశమనం లభించినా కూడా, శనివారం ఉదయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్‌ను ఒక్కసారిగా కుదిపేసింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో తగ్గిన పసిడి ధర, ట్రంప్ ప్రకటనతో మళ్లీ భారీగా పెరిగి, ఆల్ టైమ్ రికార్డు స్థాయిని నమోదు చేసింది.
శుక్రవారం భారీగా తగ్గిన బంగారం ధర శనివారం మళ్లీ అమాంతం పెరగడానికి ప్రధాన కారణం ట్రంప్ తీసుకున్న ఆర్థిక నిర్ణయమే.చైనా ఉత్పత్తులపై 100% టారిఫ్‌లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ టారిఫ్‌లు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు.
ఈ అనూహ్య ప్రకటన తరువాత అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో, ముఖ్యంగా అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక గందరగోళం ఏర్పడింది.
ఈ అనిశ్చితి వల్ల, ఇన్వెస్టర్లు మళ్లీ బంగారం వంటి సురక్షిత పెట్టుబడి (Safe Haven) సాధనాలపై ఆసక్తి చూపించారు. దీంతో కొనుగోళ్లు పెరిగి గోల్డ్ రేటు అమాంతం పెరిగింది.
ట్రంప్ నిర్ణయం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో భారీ పెరుగుదల కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో.. ఔన్స్ బంగారంపై ఏకంగా 57 డాలర్లు పెరిగింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేటు మళ్లీ 4,000 డాలర్ల మార్కును దాటి, ప్రస్తుతం 4,017 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 550 పెరగ్గా, 22 క్యారట్ల బంగారంపై రూ. 500 మేర పెరిగింది.

తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర: రూ. 1,13,900
10 గ్రాముల 24 క్యారట్ల పసిడి ధర: రూ. 1,24,260
ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి ఇతర ప్రధాన నగరాల్లో కూడా ధరలు దాదాపు ఇదే స్థాయిలో నమోదయ్యాయి.
వెండి ధర కూడా ఆల్ టైమ్ రికార్డుకు చేరువలోకి వెళ్లిపోతుంది. బంగారం(Gold)తో పాటు వెండి ధర సైతం భారీగా పెరిగి, ఆల్ టైమ్ రికార్డు స్థాయిని నమోదు చేసింది. కిలో వెండిపై ఒక్కరోజే రూ. 3,000 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నైలలో కిలో వెండి ధర రూ. 1,87,000 వద్దకు చేరింది.
దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలలో కిలో వెండి ధర రూ. 1,77,000 వద్ద కొనసాగుతోంది.ఈ పెంపుదలతో, కిలో వెండి ధర రూ. 2 లక్షలకు చేరువులో ఉంది.ఈ ధరలు అంతర్జాతీయ పరిణామాల కారణంగా గోల్డ్(Gold), సిల్వర్ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.
One Comment