Gang rape : మూగ మహిళపై గ్యాంగ్ రేప్.. 24 గంటల్లోనే ఎన్‌కౌంటర్..!
Gang rape: ఈ కేసులో పోలీసులు చూపించిన వేగం, కఠినమైన చర్యలు నేరస్థులకు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చాయి. నేరం చేసి తప్పించుకోవడం ఇక సాధ్యం కాదనే భయాన్ని వాళ్ల గుండెల్లో నింపింది. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది.

Gang rape
ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లాలో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఒక మూగ, చెవిటి మహిళపై ఇద్దరు దుండగులు అమానుషంగా అత్యాచారానికి(UP gang rape case) పాల్పడ్డారు. అయితే, ఈ భయంకరమైన నేరం జరిగిన 24 గంటలలోపే పోలీసులు నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన దుండగులకు చట్టం పట్ల భయం లేదనే సందేశాన్ని ఇస్తుంటే, పోలీసుల వేగం నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టించింది.
సోమవారం సాయంత్రం, ఆ మహిళ తన మేనమామ ఇంటి నుంచి బలరాంపూర్ జిల్లాలోని తన ఇంటికి తిరిగి వెళ్తుండగా, ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు. నిర్మానుష్యమైన పొలంలోకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం(Gang rape) చేశారు. ఆమె మూగ, చెవిటి(deaf mute woman) కావడంతో సహాయం కోసం అరవలేకపోయింది. గంటలు గడిచినా ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. చివరకు బహదూర్‌పూర్ పోలీస్ పోస్ట్ సమీపంలో ఆమెను అపస్మారక స్థితిలో కనుగొన్నారు. వెంటనే ఆమెను జిల్లా మహిళా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నా కూడా..ఈ ఘటన వల్ల తీవ్ర షాక్‌లో ఉంది.
మహిళ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగానే, అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. గంటల్లోనే నిందితుల కోసం వేట ప్రారంభించారు. అయితే, ఇక్కడే పోలీసులకు ఒక ఆసక్తికరమైన క్లూ లభించింది. బహదూర్‌పూర్ పోలీస్ పోస్ట్ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలు పని చేయకపోయినా, ఎస్పీ ఇంటి సమీపంలోని ఒక కెమెరాలో ఆ మహిళ పరుగులు పెట్టడం, కొందరు బైకర్లు ఆమెను వెంబడించడం రికార్డ్ అయింది. ఈ 14-సెకన్ల వీడియో పోలీసులకు ఒక ఆయుధంలా పనిచేసింది.

ఈ వీడియో, ఇతర ఆధారాల సహాయంతో పోలీసులు నిందితులు అంకుర్ వర్మ, హర్షిత్ పాండేలను గుర్తించారు. పోలీసులు వారిని పట్టుకునే సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిందితులు తీవ్రంగానే గాయపడ్డారు. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసుల విచారణలో నిందితులు తాము నేరం చేసినట్లు ఒప్పుకున్నారని ఎస్పీ వికాష్ కుమార్ తెలిపారు.
ఈ కేసు(Gang rape)లో పోలీసులు చూపించిన వేగం, కఠినమైన చర్యలు నేరస్థులకు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చాయి. నేరం చేసి తప్పించుకోవడం ఇక సాధ్యం కాదనే భయాన్ని వాళ్ల గుండెల్లో నింపింది. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది.