Just CrimeLatest News

WhatsApp:సైబర్ సెక్యూరిటీ అలర్ట్.. మీ వాట్సప్ , బ్యాంక్ అకౌంట్లు భద్రంగా ఉంచుకోండి

WhatsApp: వాట్సప్ ప్రొఫైల్ ఫోటో ,స్టేటస్‌ను కేవలం మీ కాంటాక్ట్స్ ఉన్నవారికి మాత్రమే కనిపించేలా సెట్ చేసుకోవాలి.

WhatsApp

మన పర్సనల్ విషయాలే కాదు.. బ్యాంకు డీటెయిల్స్ నుంచి అన్ని ఇంపార్టెంట్ సమాచారం వరకూ కూడా అన్నీ అరచేతిలో ఉండే స్మార్ట్ ఫోన్‌లోనే దాస్తున్నాం. అందుకే సైబర్ నేరగాళ్ల కన్ను మన వాట్సప్(WhatsApp ), బ్యాంక్ అకౌంట్లపై పడుతోంది.

ఒక్క చిన్న పొరపాటు చేసినా మీ అకౌంట్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. దీని నుంచి తప్పించుకోవాలంటే ఐదు ముఖ్యమైన సెట్టింగ్స్ చేసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

మొదటగా మీ వాట్సప్(WhatsApp )అకౌంట్‌లో..టూ స్టెప్ వెరిఫికేషన్ అనే ఫీచర్‌ను కచ్చితంగా ఆన్ చేసే పెట్టుకోవాలి. దీనివల్ల ఎవరైనా మీ అకౌంట్‌ను వేరే ఫోన్ లో లాగిన్ చేయడానికి ఒకవేళ ప్రయత్నిస్తే కనుక మీరు సెట్ చేసుకున్న ఆరు అంకెల పిన్ అడుగుతుంది. అది లేకపోతే హ్యాకర్లు లోపలికి రాలేరు.

అలాగే మీ వాట్సప్ ప్రొఫైల్ ఫోటో ,స్టేటస్‌ను కేవలం మీ కాంటాక్ట్స్ ఉన్నవారికి మాత్రమే కనిపించేలా సెట్ చేసుకోవాలి. దీని వల్ల తెలియని వాళ్ల నుంచి రక్షణ పొందొచ్చు.

WhatsApp
WhatsApp

బ్యాంక్ అకౌంట్ల సేఫ్టీ విషయంలో మరింత అలర్ట్‌గా ఉండాలి. బ్యాంకులు కానీ, బ్యాంకులో పనిచేసే వాళ్లు కానీ ఎప్పుడూ ఫోన్ కాల్ ద్వారా ఓటీపీ లేదా పిన్ నంబర్లు అడగవని గుర్తుంచుకోవాలి. తెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయడం వల్ల మీ ఫోన్‌లోకి మాల్‌వేర్ చేరి.. మీ బ్యాంక్ వివరాలన్నీ వేరేవాళ్లు దొంగిలించే అవకాశం ఉంది.

అంతేకాకుండా మీ ఫోన్ కి వచ్చే యాప్ పర్మిషన్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అనవసరమైన యాప్స్ కు కెమెరా , మెసేజ్, కాంటాక్ట్స్ పర్మిషన్ ఇవ్వకూడదు.

అలాగే పబ్లిక్ వైఫై వాడి బ్యాంకింగ్ లావాదేవీలు చేయడం చాలా ప్రమాదకరం అని గుర్తు పెట్టుకోవాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను మార్చడం ఒక అలవాటుగా మార్చుకోండి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు పాటిస్తూ.. మీ కష్టార్జితాన్ని సైబర్ దొంగల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

Valentine:ప్రేమాయ నమః.. పెంగ్విన్ల గిఫ్ట్స్ నుంచి కంటిపాపల రహస్యం వరకు.. వాలంటైన్ వీక్ స్పెషల్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button