Just EntertainmentLatest News

Balakrishna: బాలయ్య ఖాతాలో  నేషనల్ అవార్డ్

Balakrishna: నేషనల్ అవార్డులో బాలయ్య విజయం! ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు గెలుచుకుని, బాలకృష్ణ మాస్ నుంచి మానవీయత దాకా తన శక్తిని మరోసారి నిరూపించారు.

Balakrishna

ఇటీవలి కాలంలో ఒకటికి రెండు కాదు… వరుస విజయాలతో ఓ నటుడి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఆయనే నందమూరి బాలకృష్ణ( Balakrishna). ఈ ఏడాది ప్రారంభం నుంచీ బాలయ్య చూపించిన జోరు… అభిమానుల గుండెల్లో జల్సా మామూలుగా లేదు. ‘డాకు మహారాజ్’ సినిమాతోనే అభిమానులను హైగా చేసిన బాలయ్య, ఆ తరవాత పద్మభూషణ్ తీసుకున్న సీనియర్ స్టార్‌గా తన స్థాయిని మరోసారి నిరూపించుకున్నారు.

ఇక ఇప్పుడు… ‘అఖండ 2’ కోసం కళ్లల్లా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు ఊహించని గిఫ్ట్ అందింది. ‘భగవంత్ కేసరి’ చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఓ మాస్ యాక్షన్ ప్యాకేజ్ మూవీకి ఇంత గౌరవం రావడం అంటే మాటలు కాదు. వినోదం ఉన్నా… లోతైన సందేశం కలిగిన సినిమా ఇది అని జ్యూరీ అంగీకరించింది.

balakrishna-bhagavanth-kesari-natinal-award-2025
balakrishna-bhagavanth-kesari-natinal-award-2025

డాకు మహారాజ్’ మూవీతో ఘన విజయాన్ని అందుకున్న ఆయన… అంతలోనే పద్మభూషణ్ వంటి దేశ అత్యున్నత గౌరవాన్ని పొందారు. ఇప్పుడు అదే ఏడాది ముగిసేలోపు మరో గౌరవం బాలయ్య ఇంటి ముందు వాలింది. ఆయన నటించిన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari)చిత్రానికి భారత ప్రభుత్వం ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డు ప్రకటించింది. ఇది బాలయ్య నటనా విశ్వరూపానికి, కథలో ఉన్న సామాజిక స్పష్టతకి, ప్రేక్షకులకు చేరువైన లోతైన భావాలకు వచ్చిన నజరానాగా బాలయ్య అభిమానులు చెబతున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాలయ్య మాస్ ఇమేజ్‌ను కొత్త కోణంలో ఆవిష్కరించింది. ఆడపిల్లల శక్తిని గుర్తించే పాత్రలో బాలయ్య (balakrishna) తన నటనలో ఒదిగిపోయారు. వినోదం, యాక్షన్, భావోద్వేగం అన్నీ మేళవించి, ఆడియన్స్‌కు ఒక పాజిటివ్ మెసేజ్ ఇచ్చారు. ఇది కేవలం కమర్షియల్ హిట్ మాత్రమే కాదు… 70 కోట్ల రూపాయల షేర్ వసూల్ చేసిన సినిమా.

balakrishna
balakrishna

కాగా నేషనల్ అవార్డ్స్ 2025 (National Award 2025) ముఖ్య విజేతలు: ఉత్తమ తెలుగు చిత్రం: భగవంత్ కేసరి కాగా ఉత్తమ ఫీచర్ ఫిలిం: 12th ఫెయిల్ దక్కించుకుంది. ఉత్తమ నటుడు: షారుఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మాస్సే (12th ఫెయిల్) కు ఇస్తున్నారు. అలాగే ఉత్తమ నటి: రాణి ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ Vs నార్వే)కు, ఇక ఉత్తమ దర్శకుడు: సుదీప్తో సేన్ (ది కేరళ స్టోరీ)కి, ఉత్తమ సంగీతం: హర్ష వర్ధన్ రామేశ్వర్ (యానిమల్)కి, ఉత్తమ సంగీత దర్శకుడు: జీవి ప్రకాష్ కుమార్ (వాతి)కి, ఉత్తమ యానిమేషన్ ఎఫెక్ట్స్ మూవీ: హనుమాన్ (తెలుగు) నేషనల్ అవార్డులు దక్కించుకున్నాయి.

Also Read: Cinema : వీడెక్కడి నటుడండీ ..దక్షిణాది సినిమా భవిష్యత్తులా ఉన్నాడే..!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button