Mahesh : మహేష్ బర్త్‌డేకు డబుల్ ట్రీట్
Mahesh : సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు పండగలాంటి వార్త వచ్చేసింది.

Mahesh :సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు పండగలాంటి వార్త వచ్చేసింది. వారి ఫేవరెట్ స్టార్ పుట్టినరోజు(birthday) సందర్భంగా, ఒక ఆల్-టైమ్ క్లాసిక్ సినిమా మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తోంది. అంతేకాదు, మ్యూజిక్ లవర్స్ కోసం మరో అదిరిపోయే సర్ప్రైజ్(surprise) ఎదురు చూస్తోంది.
Mahesh Athadu
సూపర్ స్టార్ మహేష్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘అతడు’ మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది. మహేష్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిన ఈ సినిమా, సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ‘ఖలేజా’ రీ-రిలీజ్‌కు మహేష్(Mahesh) అభిమానులు చూపిన ఉత్సాహం చూశాక, ఈ ప్రకటన వారికి ఎక్స్ట్రా కిక్ ఇచ్చింది.
మహేష్ బాబు, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ‘అతడు’ మూవీ 2005 ఆగస్టు 10న రిలీజయింది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పన్స్ వచ్చింది. థియేటర్లకే కాదు, టెలివిజన్‌లోనూ ఈ మూవీకి ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. మెయిన్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ కథ బాగా కనెక్ట్ అయ్యింది. మూవీ లవర్స్ల ఈ చిత్రానికి ఒక ప్రత్యేకమైన కల్ట్ ఫాలోయింగ్ కూడా ఉంది.
అతడు(Athadu) 2025 ఆగస్టు 10 నాటికి థియేటర్లలోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా, సినిమాను 2025 ఆగస్టు 09న గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అదే రోజు మహేష్ బాబు పుట్టినరోజు కావడం ఈ సెలబ్రేషన్స్‌కు మరింత గ్లామర్ అద్దనుంది. ఈ డబుల్ ట్రీట్
మహేష్ ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిన అతడు సినిమాను 20 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా 4K రిజల్యూషన్, డాల్బీ డిజిటల్ ఆడియోతో రీ-రిలీజ్ చేస్తున్నారు. అప్‌గ్రేడెడ్ క్వాలిటీతో ఈ బ్లాక్‌బస్టర్‌ను మళ్లీ బిగ్స్క్రీన్పై చూడటం మహేష్ ఫ్యాన్స్‌కు ఒక అపురూపమైన ఎక్స్పీరియన్స్ కానుంది.
అభిమానులకు రెండో స్పెషల్ గిఫ్ట్ – మణిశర్మ అద్భుతమైన ఒరిజినల్ సౌండ్ ట్రాక్ (OST) ఇప్పుడు అధికారికంగా విడుదలైంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకు ఒక అదనపు ఆకర్షణ అన్నది అందరికీ తెలిసిందే. ఇన్నేళ్లుగా అభిమానులు పూర్తి OST కోసం ఎదురుచూస్తున్నారు. ఆ కల ఇప్పుడు నిజమైంది!
20 ఒరిజినల్ ట్రాక్‌లతో కూడిన ఈ పూర్తి OST ప్రస్తుతం యూట్యూబ్‌లో స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి వచ్చింది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ OST సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఫ్యాన్స్ దీనిపై నాన్‌స్టాప్‌గా పోస్టులు పెడుతూ, #Athadu4K, #AthaduOST వంటి హ్యాష్‌ట్యాగ్‌లను వైరల్ చేస్తున్నారు.
మహేష్ బాబుతో పాటు త్రిష హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో నాజర్, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, సోనుసూద్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. డి. కిషోర్ అండ్ రామ్మోహన్ ఎం నిర్మించిన ఈ సినిమాను, కొత్త తరానికి ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. థియేటర్లో మళ్లీ ‘అతడు‘ చూసే గోల్డెన్ ఛాన్స్ దొరకనుండటంతో సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫెస్ట్ కొనసాగుతోంది.