Bigg Boss:బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో ఒక ఆట ఆడుకుంటున్న నవదీప్
Bigg Boss:నవదీప్ వేస్తున్న ప్రశ్నలు, ఆయన ఇస్తున్న కఠినమైన టాస్క్‌లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

Bigg Boss
బిగ్ బాస్ (Bigg Boss) అగ్నిపరీక్ష షో ఇప్పుడు రసవత్తరంగా, ఉత్కంఠభరితంగా సాగుతోంది. కంటెస్టెంట్స్‌ను మామూలుగానే కాకుండా, నిజంగానే అగ్నిపరీక్షలకు గురిచేస్తూ జడ్జీలు వారికి చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా నవదీప్ వేస్తున్న ప్రశ్నలు, ఆయన ఇస్తున్న కఠినమైన టాస్క్‌లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లేందుకు అర్హులైన టాప్ 5 కంటెస్టెంట్స్ ను ఎంపిక చేయాల్సిన బాధ్యత ఈ జడ్జీల మీద ఉండటంతో, వారు కంటెస్టెంట్స్‌ను అన్ని విధాలుగా పరీక్షిస్తున్నారు.
Bigg Boss ఎపిసోడ్ 4లో జరిగిన ఒక టాస్క్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్స్ తమ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, వెంటనే తమ అకౌంట్‌లోకి డబ్బులు వేయించుకోవాలి. ఎవరైతే ఎక్కువ మొత్తం డబ్బు సంపాదిస్తారో, వాళ్లే విజేత.
ఈ టాస్క్‌పై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన శ్రీజ దమ్ము అభ్యంతరం వ్యక్తం చేస్తూ, జడ్జీల ముందుకు వచ్చింది. “టాస్క్‌ని మీరు సరిగ్గా వివరించలేదు, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారు అంటూ శ్రీజ వాదించడం మొదలుపెట్టింది. దీంతో, అక్కడే ఉన్న నవదీప్ వెంటనే రంగంలోకి దిగి, కన్ఫ్యూజ్ అయితే అది ఎవరి తప్పు అంటూ ఎదురు కౌంటర్ ఇచ్చారు.

ఈ సీన్ లో శ్రీజ మాటలకు కంగుతిన్న నవదీప్, ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. నవదీప్ ఒక్కసారిగా నువ్వు ఇక మాట్లాడడానికి వీల్లేదు! వెళ్లి కూర్చో పో! అంటూ గట్టిగా చెప్పడంతో శ్రీజ నోరు కామ్ అవక తప్పలేదు. సాధారణంగా కంటెస్టెంట్స్ విషయంలో మృదువుగా ఉండే నవదీప్, ఈసారి శ్రీజ వాదనను అస్సలు పట్టించుకోకుండా, ఆమెను కూర్చోమని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. ఇది నవదీప్ వైపు నుంచి ఒక అనూహ్యమైన, పదునైన హెచ్చరికగా కంటెస్టెంట్స్ అంతా భావించారు.
ఈ టాస్క్‌లలో భాగంగా, కంటెస్టెంట్స్ తమ ఫోన్లను సుత్తితో పగలగొట్టడం, లేనిపక్షంలో షో నుంచి బయటకు వెళ్లడం వంటి కఠినమైన ‘డేర్ ఆర్ డై’ టాస్క్‌లు కూడా ఇస్తున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అతిథిగా హాజరైన ఈ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌కు నవదీప్ చుక్కలు చూపించారు. మొత్తానికి, అగ్నిపరీక్ష షో టైటిల్‌కు తగ్గట్టుగానే జడ్జీలు కంటెస్టెంట్స్‌కు ఊపిరి సలపనివ్వడం లేదు. ఈ సీజన్ ప్రేక్షకులకు మరింత థ్రిల్‌ను అందించడం ఖాయంగా కనిపిస్తోంది.