Just EntertainmentLatest News

Mahesh Babu: బాక్సాఫీస్ సుల్తాన్ మహేష్ బాబు బర్త్‌డే స్పెషల్.

Mahesh Babu: బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మహేష్, ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli)దర్శకత్వంలో గ్లోబల్ యాక్షన్ మూవీ SSMB 29లో నటిస్తున్నారు.

Mahesh Babu

టాలీవుడ్ ప్రిన్స్‌గా సినీ వరల్డ్‌లో అడుగుపెట్టి, ఇప్పుడు సూపర్ స్టార్‌గా తనకంటూ ఒక స్పెషల్ ప్లేస్‌ను క్రియేట్ చేసుకున్న మహేష్ బాబు పుట్టినరోజు ఈరోజు. టాలీవుడ్ ‘ప్రిన్స్’గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి, ఇప్పుడు ‘సూపర్ స్టార్’గా ఎదిగిన మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి.

బాల నటుడిగా నీడ సినిమాతో మొదలైన ఆయన జర్నీ, రాజకుమారుడుతో హీరోగా మారిన తర్వాత, పాతికేళ్లకు పైగా తెలుగు సినిమాను ఒక కొత్త ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రతి మూవీలోనూ మహేష్ ప్రదర్శించే వైవిధ్యం, ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే తపనతో ప్రతి సినిమాలోనూ బెటర్మెంట్ చూపిచడానికి కొత్త హీరోలా కష్టపడటం మహేష్ స్పెషాలిటి.

 

Mahesh Babu
Mahesh Babu

పోకిరిలో మాస్ స్వాగ్, శ్రీమంతుడులో డిగ్నిటీ, భరత్ అనే నేను లో లీడర్ లక్షణాలు.. ఇలా ప్రతి క్యారెక్టర్‌లోనూ మహేష్ తనదైన మ్యానరిజంతో తనకంటూ ఒక ట్రేడ్‌మార్క్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఆయన స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ యువ నటులకు ఒక బెంచ్‌మార్క్‌గా మారాయి. అంతేకాకుండా, 50 ఏళ్ల వయసులో కూడా తన గ్లామర్, ఫిట్‌నెస్‌తో ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారంటే అది అంత ఈజీ అయిన విషయం కాదు.

బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మహేష్, ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli)దర్శకత్వంలో గ్లోబల్ యాక్షన్ మూవీ SSMB 29లో నటిస్తున్నారు. ఈ మూవీ కోసం మహేష్ కొత్త లుక్, సినిమా పరిశ్రమలో ఇప్పటికే సెన్సేషన్ సృష్టిస్తోంది.

Mahesh Babu-namrata
Mahesh Babu-namrata

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) పర్సనల్ లైఫ్ కూడా ఒక ఫెయిరీ టేల్ లా ఉంటుంది. ఆయన తండ్రి, లెజెండరీ యాక్టర్ కృష్ణ కాగా, తల్లి ఇందిరాదేవి. “వంశీ” సినిమా షూటింగ్‌లో నమ్రత (Namrata)శిరోడ్కర్‌తో ఏర్పడిన మహేష్ (Mahesh Babu) పరిచయం ప్రేమగా మారి, 2005లో వారి పెళ్లికి దారితీసింది.

ఈ సూపర్ కపుల్‌కి ఇద్దరు పిల్లలు. అబ్బాయి గౌతమ్, ప్రస్తుతం తన చదువులో బిజీగా ఉన్నాడు. అమ్మాయి సితార మాత్రం సోషల్ మీడియాలో స్టార్‌గా దూసుకుపోతోంది. ఈ మధ్యనే ఫ్యాషన్ ప్రపంచంలో కూడా అడుగుపెట్టింది. సినిమాల్లోనే కాదు, ఫ్యామిలీలోనూ మహేష్ (Mahesh Babu) ఒక పర్ఫెక్ట్ రోల్ మోడల్.

Mahesh Babu
Mahesh Babu

తెరపై ఎంత పెద్ద స్టార్ అయినా, నిజ జీవితంలో ఆయన ఎంతో నిరాడంబరంగా ఉండటం మహేష్ స్పెషల్. తన MB ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది నిరుపేదలకు వైద్య సేవలు అందిస్తూ, ఆయన ఒక సామాజిక బాధ్యత గల వ్యక్తిగా నిలిచారు. తన కుటుంబానికి ఒక మంచి తండ్రిగా, భర్తగా, సమాజానికి ఆయన ఒక గొప్ప ఇన్స్‌స్పిరేషన్.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button