Jai Hanuman: పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్‌పై కన్నేసిన ప్రశాంత్ వర్మ
దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న 'Jai Hanuman' సినిమా, భారతీయ సంస్కృతి, హనుమంతుని అపారమైన శక్తిని ఆధునిక సాంకేతికతతో కలిసి ప్రతిబింబిస్తూ పాన్ వరల్డ్ ప్రేక్షకులను ఆకర్షించబోతుంది.

Jai Hanuman
విలక్షణమైన సినిమాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఇప్పుడు తన కలల ప్రాజెక్ట్ జై హనుమాన్ (Jai Hanuman)తో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కేవలం భక్తి చిత్రాన్ని మాత్రమే కాకుండా, భారతీయ సంస్కృతి, హనుమంతుని అపారమైన శక్తిని ఆధునిక సాంకేతికతతో కలిపి చూపించాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. హను మాన్ సినిమాతో ఇప్పటికే అద్భుతమైన విజయం సాధించిన ప్రశాంత్ వర్మ, ఇప్పుడు ‘జై హనుమాన్’తో పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తిగా సిద్ధమైంది. సినిమాకు కావాల్సిన వీఎఫ్ఎక్స్ (VFX) పనులు, ఇతర ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కూడా చివరి దశలో ఉన్నాయి. ‘కాంతార 2’ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత హీరో రిషబ్ శెట్టి ఈ ప్రాజెక్ట్‌లో చేరనున్నారు. ఆయన రాగానే వెంటనే సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని టీమ్ సిద్ధంగా ఉంది.
ప్రశాంత్ వర్మ ఈ సినిమా గురించి మాట్లాడుతూ,..ఇది కేవలం ఒక భక్తి చిత్రం కాదు. ఇది మన సంస్కృతిని, హనుమంతుని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఒక సాంస్కృతిక ప్రకటన (Cultural Manifesto)” అని అన్నారు. ‘జై హనుమాన్(Jai Hanuman)’ సినిమా కోసం ప్రశాంత్ వర్మ గత కొన్ని సంవత్సరాలుగా చాలా పరిశోధన చేశారు. పురాణాల నుంచి ఆధునిక సాంకేతికత వరకు అన్ని అంశాలను ఈ సినిమాలో వాడబోతున్నారు. ‘హను మాన్’లో చూసిన విజువల్స్ కంటే ఇందులో మరింత అద్భుతమైన గ్రాఫిక్స్ ఉంటాయని అంటున్నారు. ఇది సినిమాపై ఎక్సప్టేషన్స్ను భారీగా పెంచుతోంది.

నిజానికి తెలుగులో హనుమంతునిపై చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని బాగా ఆకట్టుకొని విజయం సాధించగా, మరికొన్ని అంతగా గుర్తింపు పొందలేకపోయాయి.
జై హనుమాన్ (1997).. టీవీ సీరియల్‌గా మొదలై, ఆ తర్వాత సినిమాగా వచ్చింది. ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో రామాయణంలోని ముఖ్య ఘట్టాలు, హనుమంతుని రోల్‌కు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఆడియన్స్‌తో కనెక్ట్ అవడానికి బాగా పనిచేసింది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఒక సూపర్ హీరో కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను మెప్పించింది. తక్కువ బడ్జెట్లో అద్భుతమైన విజువల్స్, మంచి కథనం, తేజ సజ్జా నటన ఈ సినిమా భారీ విజయం సాధించడానికి కారణమయ్యాయి. ఈ సినిమా ప్రశాంత్ వర్మకు జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తీస్తున్న ‘జై హనుమాన్ (Jai Hanuman)’ మాత్రం ఈ సినిమాలన్నింటికీ ఢిఫరెంటుగా ఇంకా చెప్పాలంటే అంతకు మించి అన్నట్లు ఉండబోతోందని సినీ వర్గాలు అంటున్నాయి. ఆయన హనుమంతుడిని కేవలం భక్తి కోణంలో కాకుండా, ఒక శక్తివంతమైన సూపర్ హీరోగా, మన సంస్కృతికి ప్రతీకగా ఎలా చూపించబోతున్నారో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Pawan Kalyan : వైజాగ్‌తో పవన్ అనుబంధం ఆనాటిదా?