Peddhi: మెగా మాస్ జాతర షురూ.. ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ రిలీజ్!
Peddhi: 'చికిరి చికిరి' అంటూ మాస్ బీట్‌తో సాగిపోతున్న ఈ పాట, మెగా అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
Peddhi
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘పెద్ది(Peddhi)’ నుంచి మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఊహించిన దానికంటే ముందే, సెన్సేషనల్ క్రియేట్ చేస్తూ.. మేకర్స్ ‘చికిరి చికిరి’ పాటను రిలీజ్ చేశారు.
‘చికిరి చికిరి’ అంటూ మాస్ బీట్‌తో సాగిపోతున్న ఈ పాట, మెగా అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది.రామ్ చరణ్ మాస్ అప్పియరెన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. ఈ పాటలో రామ్ చరణ్ ఎంతో స్టైలిష్‌గా , మాస్ లుక్‌లో కనిపించారు. ఆయన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్, చరణ్ మార్క్ మాస్ ఎక్స్‌ప్రెషన్స్‌తో పాట విజువల్‌గా అద్భుతంగా ఉంది.
తొలిసారిగా తెలుగులో నటిస్తున్న జాన్వీ కపూర్ కూడా చరణ్‌తో కలిసి స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా కనిపించింది.
#Peddi First Single #ChikiriChikiri out tomorrow at 11.07 AM ❤🔥
Wait for @arrahman sir's magic 🎼#PEDDI GLOBAL RELEASE ON 27th MARCH, 2026. pic.twitter.com/xvvfUnOrje
— Ram Charan (@AlwaysRamCharan) November 6, 2025
అలాగే పాటలోని పదాలు, ట్యూన్‌కు తగ్గట్టుగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇది పక్కాగా థియేటర్లలో ఫ్యాన్స్ వేసే స్టెప్పులకు ఊపునిచ్చే పాటగా నిలవనుందని మేకర్స్ అంటున్నారు.
‘చికిరి’ అనే పదానికి దర్శకుడు బుచ్చిబాబు సానా ఇచ్చిన వివరణ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచింది. పాట ప్రోమో విడుదల సందర్భంగా ఆయన, “ఎటువంటి అలంకరణ అవసరం లేని, సహజంగా అందంగా ఉండే ఆడపిల్లల్ని ముద్దుగా ‘చికిరి’ అని పిలుస్తారు” అని తెలిపారు. ఈ ఎక్స్‌ప్లనేషన్‌తో, ఈ పాటలో రామ్ చరణ్ తన ప్రేమను ఎంత స్వచ్ఛంగా వ్యక్తపరుస్తున్నారో అర్థమవుతోంది.

‘పెద్ది(Peddhi)’ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషిస్తున్న పాత్ర పేరు అచ్చియ్యమ్మ. ఈ పాత్ర సినిమా కథనానికి, భావోద్వేగాలకు ప్రధాన బలం (Main strength) కానుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. జాన్వీ కపూర్ నటన , చరణ్‌తో ఆమె కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లోనే మరో మైలురాయిగా నిలవడానికి సిద్ధమవుతుండగా, ‘చికిరి చికిరి’ పాట విడుదల సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది.



