OG :రిలీజ్కు ముందే రికార్డులు..OG బిజినెస్ ఎంతో తెలుసా ?
OG :పవన్ కళ్యాణ్ రేంజ్ కు ఏమాత్రం తగ్గకుండా మూవీ వచ్చిందని తెలియడంతో బిజినెస్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువగానే జరిగింది.

OG
ఈ ఏడాది పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ(OG)కి వచ్చినంత హైప్ , నెలకొన్న క్రేజ్ కానీ మరే సినిమాకు రాలేదు. పవన్ గత సినిమాలతో పోలిస్తే దీని కోసం ఫ్యాన్స్ ఎదురుచూసినంతగా మరెప్పుడూ వెయిట్ చేయలేదు. పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో మూవీ చిత్రీకరణ లేటయింది. భారీ అంచనాల మధ్య బుధవారం ప్రపంచ వ్యాప్తంగా ఓజీ (OG) రిలీజ్ కాబోతోంది.
చేసింది రెండు సినిమాలే అయినా స్టైలిష్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న సుజిత్ టేకింగ్ పై పవన్ ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. హరిహర వీరమల్లు ఫ్లాప్ కావడంతో ఈ సారి ఎలాగైనా ఓజీతో హిట్టు కొడతామంటున్నారు. ఈ మూవీ ట్రైలర్ కూడా అంచనాలను మరింతగా పెంచేసింది. అయితే రిలీజ్ కు ముందే “OG” బిజినెస్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ ఎత్తునే జరిగిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రేంజ్ కు ఏమాత్రం తగ్గకుండా మూవీ వచ్చిందని తెలియడంతో బిజినెస్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువగానే జరిగింది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం రిలీజ్ కు ముందే ఓజీ(OG) మూవీ రూ.300 కోట్ల బిజినెస్ జరిగినట్టు అర్థమవుతోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ రూ. 81 కోట్లకు అమ్ముడయ్యాయి. అలాగే ఆడియో హక్కులు రూ. 16 కోట్లు, హిందీ వెర్షన్లో రూ. 16 కోట్లకు విక్రయించినట్టు తెలుస్తోంది. శాటిలైట్ హక్కులు కాకుండా నాన్ థియేటర్ రైట్స్ కింద రూ. 113 కోట్ల బిజినెస్ జరిగినట్టు చెప్పొచ్చు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కు భీభత్సమైన క్రేజ్ ఉన్న ఆంధ్రా ఏరియాను రూ. 80 కోట్లకు విక్రయించారు.
సీడెడ్ ఏరియా 23 కోట్లు, ఓవర్సీస్ 13 కోట్ల బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక నైజాం థియేటర్ రైట్స్ చూస్తే 50 కోట్లు వచ్చాయి. అటు కర్ణాటక హక్కులు 10 కోట్ల వరకూ ఉన్నట్టు సమాచారం. దీని ప్రకారం చూసుకుంటే థియేటర్ బిజినెస్ ద్వారానే 180 కోట్లు వచ్చేసింది. నాన్ థియేటర్, థియేటర్ రెండూ కలుపుకుంటే ఎంత లేదన్నా రూ. 300 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్టు అంచనా వేస్తున్నారు.
కాగా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం రూ. 175 కోట్ల వరకూ షేర్ కలెక్షన్స్ రాబట్టాలని, ఓవరాల్ గా రూ. 350 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో భారీగానే ఆదాయం వచ్చింది. దసరా సెలవులు కావడం, మరే సినిమా పోటీలో లేకపోవడంతో సినిమా బాగుందన్న టాక్ వస్తే చాలు భారీ కలెక్షన్లు కురవడం ఖాయమని అంచనా వేస్తున్నారు. సెన్సార్ వాళ్లు ఏ సర్టిఫికెట్ ఇచ్చినా కూడా ఫుల్ యాక్షన్ మూవీ కావడంతో అభిమానులకు పండగేనని చెబుతున్నారు.