Just EntertainmentJust TelanganaLatest News

Akhanda 2 Makers: తెలంగాణ హైకోర్టులో అఖండ 2 మేకర్స్‌కు ఊరట

Akhanda 2 Makers: సస్పెన్షన్ కారణంగా, తెలంగాణ రాష్ట్రంలో అఖండ 2 సినిమా టికెట్ రేట్లను పెంచుకోవడానికి మేకర్స్‌కు మళ్లీ అవకాశం లభించినట్లయింది.

Akhanda 2 Makers

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ సినిమా మేకర్స్‌కు(Akhanda 2 Makers) తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో పెద్ద ఊరట లభించింది. ఈ సినిమాకు సంబంధించిన టికెట్ రేట్ల పెంపు (Ticket Price Hike) విషయంలో గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు తాజాగా సస్పెండ్ (Suspend) చేసింది.

ఈ వివాదం ఎలా మొదలైందంటే.. అఖండ 2 సినిమా టికెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఒక జీవో (Government Order) జారీ చేసింది. ఈ జీవోను వ్యతిరేకిస్తూ, తెలంగాణకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ (Lunch Motion Petition) దాఖలు చేశారు.

ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం మొదట.. టికెట్ రేట్స్ పెంపు, అలాగే ప్రీమియర్ షోలకు (Premier Shows) అనుమతులు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆ జీవోను కొట్టివేసింది. దీంతో టికెట్ రేట్లు పెంచడానికి అవకాశం లేకుండా పోయింది.

Akhanda 2 Makers
Akhanda 2 Makers

మళ్లీ ఈ అంశంపై కోర్టులో వాదనలు జరిగాయి. తాజా విచారణ తర్వాత, హైకోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది.
ఈ సస్పెన్షన్ కారణంగా, తెలంగాణ రాష్ట్రంలో అఖండ 2 సినిమా టికెట్ రేట్లను పెంచుకోవడానికి మేకర్స్‌కు మళ్లీ అవకాశం లభించినట్లయింది.

హైకోర్టు ఇచ్చిన ఈ తాజా నిర్ణయంతో ‘అఖండ 2’ మేకర్స్(Akhanda 2 Makers) , డిస్ట్రిబ్యూటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button