Nidhi Agarwal:ఆ ప్రభుత్వ వాహనంపై రచ్చ ..హీరోయిన్ నిధి అగర్వాల్ క్లారిటీ
Nidhi Agarwal: భీమవరంలో జరిగిన ఒక కార్యక్రమం కోసం ఆమె ప్రయాణించిన వాహనంపై తీవ్రమైన ఊహాగానాలు మొదలయ్యాయి.

Nidhi Agarwal
సినీ తారల జీవితంలో ఏ చిన్న సంఘటన జరిగినా అది సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇటీవల నటి నిధి అగర్వాల్ విషయంలో కూడా ఇదే జరిగింది. భీమవరంలో జరిగిన ఒక కార్యక్రమం కోసం ఆమె ప్రయాణించిన వాహనంపై తీవ్రమైన ఊహాగానాలు మొదలయ్యాయి.
ఆ వాహనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందినదని, అందుకే ఆమెకు అధికార పార్టీ నాయకులతో సంబంధాలు ఉన్నాయని కొంతమంది సోషల్ మీడియాలో కావాలని ప్రచారం చేశాయని సమాచారం. దీనిపై వస్తున్న విమర్శలకు ముగింపు పలకడానికి నిధి అగర్వాల్ ఒక లేఖ విడుదల చేసి అసలు విషయం ఏమిటో స్పష్టం చేశారు.
తన లేఖలో నిధి అగర్వాల్(Nidhi Agarwal) ప్రధానంగా మూడు ముఖ్య విషయాలను వెల్లడించారు. భీమవరంలోని ఆ ఈవెంట్‌కు వెళ్ళడానికి స్థానిక ఆర్గనైజర్లు ఆమె కోసం ఒక వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఆ వాహనం ఏపీ ప్రభుత్వానికి సంబంధించినది కావడం వల్ల ఈ గందరగోళం మొదలైంది.
— Nidhhi Agerwal 🌟 Panchami (@AgerwalNidhhi) August 11, 2025
ప్రభుత్వ వాహనాన్ని నాకు నేనుగా కోరలేదు, దానిని నేను ఎంపిక చేసుకోలేదు. కేవలం ప్రయాణ సౌకర్యం కోసం ఆర్గనైజర్లు దానిని ఏర్పాటు చేశారు,” అని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు తనకు వాహనం పంపలేదని నిధి అగర్వార్ తేల్చి చెప్పారు.
సోషల్ మీడియాలో తన గురించి, ప్రభుత్వ వాహనం గురించి జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని ఆమె చెప్పారు. “ఆ వార్తలన్నీ నిరాధారం. ఈ తప్పుడు సమాచారానికి నాకు ఎలాంటి సంబంధం లేదు,” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక సెలబ్రిటీ ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించడం అనేది అసాధారణమైన విషయం. దీనిని పట్టుకొని, నిధి అగర్వాల్‌కు ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే ఆమెకు ఈ గౌరవం దక్కిందని పని కట్టుకుని మరీ కొన్ని సోషల్ మీడియా వర్గాలు ప్రచారం చేశాయి.
అభిమానులు నిజం తెలుసుకుంటారని తనకు నమ్మకం ఉన్నా.. తప్పుడు సమాచారం ప్రచారంలో ఉన్నప్పుడు స్పందించడం తన బాధ్యత అని నిధి అగర్వాల్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ వివరణతోనైనా అనవసరమైన ఊహాగానాలకు తెరపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
మొత్తంగా, ఒక చిన్న సంఘటనను రాజకీయ ప్రచారానికి వాడుకుని అనవసరమైన వివాదాన్ని సృష్టించారని, నిధి అగర్వాల్ (Nidhi Agarwal) ఇచ్చిన స్పష్టతతో ఈ గందరగోళం ముగిసిందో లేక ఇదే కంటెన్యూ చేస్తారో చూడాలి.