Mrunal :19 ఏళ్లప్పుడు చేసిన పనికి ఇప్పుడు సిగ్గుపడుతున్నా..మృణాల్ పశ్చాత్తాపం
Mrunal : వివాదం తీవ్రం కావడంతో మృణాల్ ఠాకూర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా దీనిపై స్పందించారు.

Mrunal
కావాలనో, అనుకోకుండానే నోరు జారితే దాని ఎఫెక్ట్ మాత్రం నెలలు, కొన్ని సార్లు సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ మృణాల్ విషయంలోనూ ఇదే ప్రూవ్ అయింది. బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్, ఒకప్పుడు తన కెరీర్ ఆరంభంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
‘కుంకుమ్ భాగ్య’ సీరియల్‌లో మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) నటిస్తున్న సమయంలో, ఒక టీవీ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) తన సహనటుడు అర్జిత్ తనేజాని ఉద్దేశించి “నువ్వు కండలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? అయితే వెళ్లి బిపాసా బసును పెళ్లి చేసుకో. నేను బిపాసాకన్నా చాలా అందంగా ఉంటాను” అంటూ చెప్పుకొచ్చింది. .
ఈ వ్యాఖ్యల్లో బిపాసా బసు కండలు తిరిగిన పురుషుడిలా కనిపిస్తారని ఆమె అనడాన్ని అప్పట్లో ఈ వ్యాఖ్యలను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు . కానీ ఎందుకో ఈమధ్య మాత్రం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవడంతో, మృణాల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. నెటిజన్లు, బాలీవుడ్ ప్రముఖులు మృణాల్ వ్యాఖ్యలను ఇది బాడీ-షేమింగ్ అంటూ ఖండించారు.

అంతేకాదు మృణాల్ వ్యాఖ్యలపై బిపాసా బసు కూడా పరోక్షంగా స్పందించారు. నేరుగా మృణాల్ పేరు ప్రస్తావించకుండా, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. “బలమైన మహిళలు ఒకరికొకరు అండగా చేరాలి. అందమైన అమ్మాయిలు కండలు సంపాదించండి; శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి కండలు ఎంతో అవసరం. మహిళలు బలంగా కనిపించకూడదు అన్న పాత ఆలోచనలను విస్మరించండి!” అంటూ ఆమె ఘాటైన సమాధానం ఇచ్చారు.
ఈ వివాదం మహిళా సాధికారత, బాడీ షేమింగ్ వంటి అంశాల పట్ల ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు ఒక ఉదాహరణగా నిలిచింది.ఇలా ఈ వివాదం తీవ్రం కావడంతో మృణాల్ ఠాకూర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా దీనిపై స్పందించారు.

19 ఏళ్ల వయసులో తెలివితక్కువగా మాట్లాడాను. ఆ మాటలు ఎంతమందిని బాధించవచ్చో అప్పుడది నాకు అర్థం కాలేదు. ఎవరినీ అవమానించాలనీ, లేదా బాడీ-షేమింగ్ చేయాలనీ నా ఉద్దేశం కాదు. అది చాలా చిన్నతనంలో, సరదాగా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పిన మాట. కానీ ఇప్పుడు నేను అంతటి బాధ కలిగించినందుకు విచారిస్తున్నాను. ఇప్పుడు అందానికి తేడాలే లేవని, అందం అనేది ప్రతి రూపంలోనూ విలువైనదని నేర్చుకున్నాను” అని ఆమె రాసుకొచ్చారు.
తన తప్పును అంగీకరించి, పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో ఈ వివాదానికి మృణాల్ చెక్ పెట్టినట్లయింది. మరి బిపాసా అభిమానులు దీనిపై ఎలా రియాక్టవుతారో చూడాలి.