Just EntertainmentLatest News

Wedding Date: విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ముహూర్తం ఫిక్స్? ఉదయపూర్ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్.. డేట్ ఎప్పుడంటే?

Wedding Date: విజయ్ దేవరకొండ తన కెరీర్‌లో 'అర్జున్ రెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నారు. అటు రష్మిక 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది.

Wedding Date

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా వినిపిస్తున్న మోస్ట్ సెలబ్రేటెడ్ రూమర్ విజయ్ దేవరకొండ , రష్మిక మందన్నల ప్రేమాయణం. ఇప్పుడు ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త ఫిలిం నగర్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 2026 ఫిబ్రవరి 26న (Wedding Date)విజయ్ – రష్మికల వివాహం అత్యంత వైభవంగా జరగనుందని.. ఈ వేడుక కోసం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ను వేదికగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ (Wedding Date)లాగా కేవలం అతికొద్ది మంది బంధువులు , అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహం జరగబోతోంది. అక్టోబరు నెలలోనే వీరిద్దరూ అత్యంత రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారని, ఆ సమయంలో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయినట్లు మీడియా, సోషల్ మీడియా కోడై కూసింది. ఈ విషయాన్ని రెండు కుటుంబాలు అధికారికంగా వెల్లడించకపోయినా, ఇప్పుడు పెళ్లి తేదీ ఖరారు అయిందన్న వార్తలు వినిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

విజయ్ దేవరకొండ, రష్మికల జర్నీ గురించి చెప్పుకోవాలంటే వీరిద్దరూ కలిసి నటించిన ‘గీత గోవిందం’ సినిమాతో వీరి కెమిస్ట్రీ వెండితెరపై మ్యాజిక్ చేసింది. ఆ సినిమా షూటింగ్ సమయం నుండే వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగి అది కాస్తా ప్రేమగా మారిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో కూడా వీరిద్దరూ జంటగా నటించి మెప్పించారు.

Wedding Date
Wedding Date

అప్పటి నుంచి ఈ జంట ఎక్కడ కనిపించినా మీడియాలో వీరి పెళ్లి (Wedding Date)గురించి వార్తలు వచ్చేవి. ముఖ్యంగా వెకేషన్లకు వెళ్లినప్పుడు ఒకే రకమైన లొకేషన్ల నుంచి ఫోటోలు షేర్ చేయడం, ఒకరి ఇంట్లో జరిగే పండుగల్లో మరొకరు కనిపించడం వంటి సంఘటనలు వీరి రిలేషన్‌ను బలపరిచాయి. విజయ్ తనను ప్రేమగా ‘రష్’ అని పిలుస్తారని, రష్మిక కూడా విజయ్ కుటుంబాన్ని ఎంతో గౌరవిస్తుందని వారిద్దరి సన్నిహితులు చెబుతుంటారు.

వీరిద్దరూ తమ రిలేషన్ గురించి ఎప్పుడు అడిగినా చాలా సున్నితంగా తప్పించుకునేవారు. కానీ వారు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, ఒకరిపై ఒకరు చూపించుకునే అభిమానం చూసి నెటిజన్లు వీరు ప్రేమలో ఉన్నారని ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. రష్మిక నేషనల్ క్రష్ గా ఎదిగి బాలీవుడ్‌లో కూడా బిజీగా మారినా సరే, విజయ్ తో తన అనుబంధాన్ని మాత్రం అలాగే కొనసాగించింది.

విజయ్ దేవరకొండ తన కెరీర్‌లో ‘అర్జున్ రెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నారు. అటు రష్మిక ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది. ఇలాంటి సక్సెస్ ఫుల్ కెరీర్ ఉన్న ఇద్దరు స్టార్స్ ఒకటి కావడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మెమరబుల్ ఈవెంట్ కానుంది.త్వరలోనే వీరిద్దరి పెళ్లి డేట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button