Just EntertainmentLatest News

Hari Hara Veera Mallu : వీరమల్లు డిజిటల్ వార్‌కు ఎండ్ కార్డ్ ఎప్పుడు?

Hari Hara Veera Mallu : ఇప్పుడు ఎక్కడ చూసినా హరిహర వీరమల్లు చర్చే నడుస్తోంది. మూవీ గురించి పాజిటివ్‌గా ఎంత మంది మాట్లాడుతున్నారో.. అదే సంఖ్యలో నెగిటివ్‌గానూ మాట్టాడుతున్నారు.

Hari Hara Veera Mallu : ఇప్పుడు ఎక్కడ చూసినా హరిహర వీరమల్లు చర్చే నడుస్తోంది. మూవీ గురించి పాజిటివ్‌గా ఎంత మంది మాట్లాడుతున్నారో.. అదే సంఖ్యలో నెగిటివ్‌గానూ మాట్టాడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే గతంలో ఎప్పుడూ లేనంతగా డిజిటల్ వార్( Digital War) ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఇది సినీ పరిశ్రమకు చెందినది భావించిన టీడీపీ, బీజేపీ సోషల్ మీడియా మౌనంగానే ఉంది. దీంతో వైసీపీ (YSRCP)వెర్సస్ జనసేన(Janasena) అన్నట్లుగా పెద్ద ఎత్తున డిజిటల్ యుద్ధం సాగుతోంది.

Veeramallu Digital War

ఒక విధంగా చెప్పాలంటే ఏ హీరోకి కానీ, ఏ రాజకీయనాయకుడి విషయంలో కానీ ఇంత గలాటా జరగలేదనే చెప్పొచ్చు. హరిహర వీరమల్లు ప్లాప్ అవడం, హిట్ అవడం అన్నది పక్కన పెడితే ఈ రేంజ్‌లో వ్యతిరేకతను మూటగడుతోంది మాత్రం పెయిడ్ వైసీపీ సోషల్ మీడియా అని జనసైనికులు ఫైరవుతున్నారు. పొలిటికల్ కక్షను సినీ రంగానికి రుద్దుతూ హరిహరవీరమల్లు సినిమాను బద్నాం చేస్తున్నారంటూ మండి పడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఎలక్షన్స్ టైమ్‌లో కూడా పవన్‌ పేరును టచ్ చేయని వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్.. ఏకంగా స్టేటస్‌లు పెట్టి మరీ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ ఈ సినిమా అదిరిపోయిందని చెబుతుంటే.. ఛఛ ఇదేం సినిమా రెండో డైరక్టర్ జ్యోతి కృష్ణ కనబడితే కచ్చితంగా కొడతామంటూ మరికొందరు హంగామా చేస్తున్నారు. ఎవరో చరిత్రపై పూర్తి అవగాహన లేని ఓ ఫ్యాన్ మాట్లాడిన వీడియోను, నెగిటివ్‌గా మాట్లాడిన ఆడియన్స్ బైట్స్‌ను వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తుంటే.. ఇదంతా కావాలని వైసీపీ చేస్తున్న పొలిటికిల్, సినీ కుట్ర అంటూ జనసైనికులు కౌంటర్ ఇస్తున్నారు.

నిజమే చరిత్రకు సాక్ష్యం ఈ హరిహర వీరమల్లు అని మూవీ టీమ్ చెప్పడం కూడా ఈ సినిమాకు మైనస్ అయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే చరిత్ర లెక్కలను మార్చే కొన్ని సీన్లు పెట్టినప్పుడు దానిని ఎవరైనా తప్పు అని ఒప్పుకోవాల్సిందే. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అదే చేసి చాలా హుందాగా వ్యవహరించారు. హరిహర వీరమల్లులో సాంకేతికంగా కొన్ని తప్పులు ఉన్నాయని చెప్తున్నారని సక్సెస్ మీట్‌లో చెప్పిన పవన్.. ఇంకా ఏవైనా పొరపాట్లు ఉంటే చెప్పాలని కోరారు. హరిహర వీరమల్లు రెండో భాగంలో వాటిని సరిదిద్దుకుంటామని ఓపెన్‌గానే ఒప్పుకున్నారు.

ఈ టోటల్ ఎపిసోడ్‌లో ఒకసారి పవన్ సినీ కెరీర్‌ను రీ కలెక్ట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది. మామూలుగా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో హరిహరవీరమల్లు సినిమాతో కలిపి 29 సినిమాలలో నటించగా..అందులో చాలా వరకూ అనుకున్నంత హిట్‌ను కొట్టలేకపోయాయి. అత్తారింటికి దారేది,వకీల్‌ సాబ్,గబ్బర్ సింగ్ , భీమ్లానాయక్, ఖుషీ, బద్రీ, తమ్ముడు, తొలిప్రేమ, సుస్వాగతం వంటి సినిమాలు హిట్స్, సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. వీటితో పోల్చుకుంటే మిగిలినవన్నీ తేలిపోయాయి.

అయినా పవన్ క్రేజ్ అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ హిట్, ఫట్‌తో సంబంధం లేకుండా పవన్ సినిమా బొమ్మ పడిందంటే చాలు..పవన్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోవాల్సిందే.. థియేటర్లలో కాసుల వర్షం కురవాల్సిందే . అదే ధీమాతోనే నిర్మాతలు, బయ్యర్స్ ఉంటారు..ఉంటున్నారు. కానీ ఇప్పుడు హరిహరవీరమల్లు మూవీతో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. అట్టర్ ప్లాప్ సినిమాకు కూడా లేని ట్రోలింగ్స్ ఇప్పుడు వీరమల్లు మూటకట్టుకున్నాడు. మొత్తంగా వైసీపీ వెర్సస్ జనసేన అన్నట్లుగా సాగుతున్న డిజిటల్ వార్‌తో ట్రాఫిక్ జామ్ అయిన సోషల్ మీడియా.. ఎప్పుడు రూట్ క్లియర్ చేసుకుంటుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button