Putin: ఫ్లేట్ ఫిరాయించిన అమెరికా.. పుతిన్ తర్వాతి స్టెప్ ఏంటి ?
Putin: తాజాగా పుతిన్ నివాసంపైనా డ్రోన్‌తో దాడి ఘటన తర్వాత ఉద్రిక్తతలు రెట్టింపయ్యాయి. ఇటీల నోవ్‌గొరొడ్ ప్రాంతంలో పుతిన్ (Putin)వ్యక్తిగత నివాసంపై డ్రోన్లతో దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించిందని రష్యా ఆరోపించింది.
Putin
రష్యా , ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పట్లో ముగింపు కార్డు పడే అవకాశాలు లేవు. తాజా పరిణామాలతో ఇది పూర్తిగా స్పష్టమవుతోంది. గత నెల రోజులుగా చాలా వార్తలు వినిపించాయి. శాంతి ఒప్పందం 90శాతం పూర్తయిందనీ, 10శాతం మాత్రమే పెండింగ్‌లో ఉందనీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ చెప్పగా.. చర్చలు ఫలించకుంటే మిగిలిన ఉక్రెయిన్ ను ఆక్రమిస్తామంటూ పుతిన్(Putin)తేల్చి చెప్పడం మరింత టెన్షన్ ను పెంచింది. . శాంతి ఒప్పందం 90శాతం పూర్తయిందని చెప్పిన జెలెన్స్కీనే దగ్గరుండి భారీ డ్రోన్లతో దాడులు చేయిస్తుండడంతో రష్యా తీవ్ర ఆగ్రహంతో ఉంది.
తాజాగా పుతిన్ నివాసంపైనా డ్రోన్‌తో దాడి ఘటన తర్వాత ఉద్రిక్తతలు రెట్టింపయ్యాయి. ఇటీల నోవ్‌గొరొడ్ ప్రాంతంలో పుతిన్ (Putin)వ్యక్తిగత నివాసంపై డ్రోన్లతో దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించిందని రష్యా ఆరోపించింది. దీనిని ఉగ్రదాడిగా పేర్కొంటూ నివాసానికి ఎటువంటి నష్టం కలగలేదని తెలిపింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసింది. అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్ ఖండించింది. ఇదంతా అవాస్తవమని పేర్కొంది. ట్విస్ట్ ఏంటంటే.. ఆ దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఖండించారు. ఆ ఘటన గురించి పుతిన్ తనతో మాట్లాడినట్లు, ఇలాంటి ఘటనలను తాను ఉపేక్షించబోనని చెప్పారు.

అయితే మరోసారి మాట మార్చింది పుతిన్‌ను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడిందన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని అమెరికా నిఘా సంస్థ సీఐఏ స్పష్టం చేసింది. రష్యాలోని నోవ్‌గొరొడ్ ప్రాంతంలో ఉన్న పుతిన్ వ్యక్తిగత నివాసంపై దాడి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ మేరకు వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా పుతిన్ ఇంటిపై దాడి జరిగింది నిజమని, అందుకు సాక్ష్యం ఇదేనని రష్యా వీడియో కూడా విడుదల చేసిన సమయంలో అమెరికా ఇలాంటి ప్రకటన చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఉక్రెయిన్ ప్రణాళికలు రచించిన మాట వాస్తవమే కానీ.. అవి
పుతిన్ నివాసానికి దరిదాపుల్లో కూడా లేవని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలోనూ పుతిన్ సీరియస్‌గా ఉన్నారు. శాంతి, సంధి వంటి అంశాలను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఉక్రెయిన్ కథ ముగించాల్సిందే అన్న మాటలు మాట్లాడుతున్నారు. ఒకవిధంగా ఈ డ్రోన్ దాడి ఉక్రెయిన్ చేయించి ఉంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.



