Baba Vanga:బాబా వంగా జోస్యం..ఈ ఆగస్టులో డబుల్ ఫైర్‌తో ప్రపంచం నాశనం తప్పదా?
Baba Vanga: 9/11 (బిల్డింగ్‌లు కూలిపోవడం), సునామీ, పెద్ద భూకంపాలు, రాజకీయ హత్యలు వంటి అనేక సంఘటనలు నిజమయ్యాయని ఆమె అభిమానులు బలంగా నమ్ముతారు.

Baba Vanga
భవిష్యత్తును చూడగలిగే అసాధారణ శక్తితో,తన పేరును ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటున్నపేరు బాబా వంగాది. బల్గేరియాకు చెందిన ఈ జ్ఞాన ప్రవక్త చెప్పిన ఎన్నో భవిష్యవాణిలు నిజమయ్యాయి. ఇప్పుడు,ఆమె 2025 ఆగస్టు కోసం చెప్పిన డబుల్ ఫైర్ జోస్యం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ డబుల్ ఫైర్ ఎలాంటి పరిణామాలను తీసుకొస్తాయోనని అందరూ ఆందోళన చెందుతున్నారు.
ఇంతకీ బాబా వంగా(Baba Vanga) చెబుతున్న దాని ప్రకారం డబుల్ ఫైర్ అంటే ఏంటంటే..2025 ఆగస్టు నాటికి ప్రపంచాన్ని పీల్చే రెండు పెద్ద మంటలు సంభవించబోతున్నాయి. ఫైర్ అంటే కేవలం నిజమైన అగ్ని ప్రమాదం మాత్రమే కాదు, అది జనజీవితాన్ని దెబ్బతీసే ఒక పెను విపత్తు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ మంటలు పర్యావరణపరమైన విపత్తులు కావచ్చు, లేదా భయంకరమైన యుద్ధాలుగా రూపాంతరం చెందవచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఆగస్టులో ఇటీవల అమెరికా, కెనడా, యూరప్ వంటి దేశాల్లో ఇప్పటికే అఖండ అటవీ మంటలు, తీవ్రమైన ఎండలు, ప్రకృతి విపత్తులు సంభవించాయి. ఇది బాబా వంగా చెప్పిన ఫైర్ వన్‌కు ప్రతీకగా కొందరు భావిస్తున్నారు.
ఇక మరోవైపు ఉక్రెయిన్-రష్యా యుద్ధం(Russia Ukraine war) కొనసాగుతుండగా, ట్రంప్-పుతిన్ భేటీలు, మరికొన్ని దేశాల్లో పెరుగుతున్న సైనిక చర్యలు, దాడులు వంటివి ఫైర్ టూగా విశ్లేషిస్తున్నారు. ఈ రెండు పరిణామాలు ప్రపంచాన్ని ఆర్థికంగా, సామాజికంగా అల్లకల్లోలం చేస్తాయనే భయం ప్రజల్లో నెలకొంది.

గతంలో ఆమె చెప్పిన చాలా జోస్యాలు నిజమయ్యాయి. ముఖ్యంగా 9/11 (బిల్డింగ్‌లు కూలిపోవడం), సునామీ, పెద్ద భూకంపాలు, రాజకీయ హత్యలు వంటి అనేక సంఘటనలు నిజమయ్యాయని ఆమె అభిమానులు బలంగా నమ్ముతారు. కాలానుగుణంగా ఆమె జోస్యాలకు కొత్త అర్థాలు, అన్వయాలు దొరుకుతుండటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. భవిష్యత్తులోనూ ఆమె జోస్యం నిజమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల.. భారీ వర్షాలు, వరదలు, మంటలు, ఇతర విపత్తులు సంభవించవచ్చని భావిస్తున్నారు. అలాగే, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగి, ప్రపంచానికి ప్రమాదకరమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా, ఈ జోస్యం నిజమవుతుందా లేదా అనేది వేచి చూడాలి.
One Comment