H-1B visa:హెచ్-1బీ వీసా ఫీజుపై క్లారిటీ..లక్ష డాలర్ల ఫీజు వారికి మాత్రమే
H-1B visa: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఈ విషయంపై స్పందిస్తూ, లక్ష డాలర్ల రుసుము ఒక వార్షిక ఫీజు కాదని, దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్‌టైమ్ ఫీజు మాత్రమేనని తెలిపారు.

H-1B visa
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా (H-1B Visa) ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ తీసుకున్న సంచలన నిర్ణయం భారతీయ ఐటీ నిపుణుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. అయితే, ఈ భయాందోళనలకు స్వస్తి పలుకుతూ, వైట్‌హౌస్ తాజాగా ఒక స్పష్టతనిచ్చింది. ఈ కొత్త నిబంధనలు కేవలం కొత్తగా హెచ్-1బీ వీసా (H-1B Visa) కోసం దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే వర్తిస్తాయని వెల్లడించింది.
Fact Sheet: President Donald J. Trump Suspends the Entry of Certain Alien Nonimmigrant Workershttps://t.co/k46jPq4pg5
— Karoline Leavitt (@PressSec) September 20, 2025
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఈ విషయంపై స్పందిస్తూ, లక్ష డాలర్ల రుసుము ఒక వార్షిక ఫీజు కాదని, దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్‌టైమ్ ఫీజు మాత్రమేనని తెలిపారు. ప్రస్తుతం హెచ్-1బీ వీసా(H-1B Visa) కలిగి ఉండి, అమెరికా బయట ఉన్నవారు ఆందోళన చెందొద్దని..వెంటనే అమెరికాకు తిరిగి రావాల్సిన అవసరం లేదని, అలాగే వారిపై ఈ లక్ష డాలర్ల రుసుము విధించబోమని ఆమె భరోసా ఇచ్చారు. ఈ కొత్త నిబంధనలు వారికి వర్తించవని, వారు ఎప్పటిలాగే అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి రావచ్చని ఆమె స్పష్టం చేశారు. అంటే ఎప్పటిలాగే తమ ప్రయాణాలను కొనసాగించవచ్చని వైట్‌హౌస్ స్పష్టం చేసింది.
ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే తమపై ప్రభావం చూపుతుందని భయపడిన వీసాదారులకు, వైట్‌హౌస్ ఇచ్చిన ఈ క్లారిటీ ఒక పెద్ద ఉపశమనం కలిగించింది. ఈ మొత్తం ప్రక్రియలో మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు సమాచారం గందరగోళానికి కారణమైంది. అయితే, వైట్‌హౌస్ స్పష్టతతో ఎక్కడికక్కడ భయాందోళనలు తగ్గాయి.
ఈ నిర్ణయం అమెరికాలో చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం కోసం ఎదురుచూసే విద్యార్థులకు మాత్రం ఒక సవాల్‌గా మారనుంది. లక్ష డాలర్ల ఫీజు అనేది చిన్న కంపెనీలకు భారం కావచ్చు. ఏదేమైనా, ఈ నిర్ణయం భారతీయ నిపుణులపై చూపించే తక్షణ ప్రభావం తగ్గడం మంచి విషయం.
One Comment