Just InternationalLatest News

Cycling: తాగి సైకిల్ తొక్కినా నేరమే..  డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..ఎక్కడో తెలుసా ?

Cycling: బ్రీత్ ఆల్కహాల్ టెస్ట్‌లో లీటరుకు 0.15 మిల్లీగ్రాములు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లు తేలితే సైక్లిస్టులకు జరిమానా విధిస్తారు.

Cycling

మన దేశంతో పోలిస్తే విదేశాల్లో పలు చోట్ల చాలా విషయాల్లో నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటాయి. ఎక్కడైనా మద్యం తాగి వాహనం నడిపితే నేరమే… అయితే భారత్ లో స్కూటర్, బైక్స్, కార్లు , బస్సు, లారీలు వంటి వాటిని డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే నేరంగా భావిస్తారు. కానీ జపాన్ లో మాత్రం కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి తీసుకొచ్చారు. దీని ప్రకారం మందు కొట్టి సైకిల్ (Cycling)తొక్కితే నేరంగా పరిగణిస్తారు.

అంతేకాదు దీనికి శిక్షగా మొదట కారు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు.ఇప్పటికే దీనిని కఠినంగా అమలు చేస్తున్నారు. జపాన్ లో సైక్లింగ్ (Cycling)చేసే వాళ్లు కూడా ఎక్కువే. అయితే వారంతా చాలా సందర్భాల్లో తాగి తొక్కుతున్నారని తేలింది. దీంతో చర్యలకు శ్రీకారం చుట్టి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. తాజాగా మందు కొట్టి సైకిళ్లు తొక్కుతూ పట్టుబడిన దాదాపు 900 మందికి పైగా సైక్లిస్టుల కార్ డ్రైవింగ్ లైసెన్స్‌ పోలీసులు రద్దు చేశారు.

Cycling
Cycling

మద్యం తాగి సైకిల్ (Cycling)నడిపిన వ్యక్తులు కారు నడుపుతున్నప్పుడు కూడా ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉందని భావించే ఈ చర్య తీసుకున్నారు. సైక్లిస్టులపై కఠిన జరినామాలు విధించేలా ఇటీవలే అక్కడ కొత్తగా కఠిన చట్టాలు ప్రవేశపెట్టారు. వీటితో మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి., జనవరి నుంచి సెప్టెంబర్ వరకూ తాగి సైకిల్ తొక్కుతూ రద్దయిన లైసెన్సుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్టు చెబుతున్నారు.

జపాన్ ప్రభుత్నం తీసుకొచ్చిన కొత్త చట్టాల ప్రకారం మందు కొట్టి సైకిల్ తొక్కేవారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ.2.8 లక్షల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది. దీంతో పాటు కారు డ్రైవింగ్ లైసెన్సుకు కూడా రద్దు చేస్తారు. ఇదిలా ఉంటే తాగి సైకిల్ నడిపినందుకు శిక్ష విధించే ఆల్కహాల్ పరిమితిని కూడా బాగా తగ్గించారు.

బ్రీత్ ఆల్కహాల్ టెస్ట్‌లో లీటరుకు 0.15 మిల్లీగ్రాములు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లు తేలితే సైక్లిస్టులకు జరిమానా విధిస్తారు. కానీ గతంలో సైకిల్‌ను సరిగ్గా తొక్కలేకపోతే మాత్రమే శిక్ష విధించేవారు. ఇప్పుడు మాత్రం ఆల్కహాల్ పరిమితిని బట్టి శిక్ష విధించేలా చట్టాలు తీసుకొచ్చారు. అంతే కాదు మద్యం తాగి తొక్కేవారికి సైకిల్స్ ఇచ్చినా కూడా నేరమేనని చెబుతున్నారు. గత ఏడాది కాలంగా ఐదు వేల మందికి పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికారు. వీరంతా మద్యం సేవించి సైకిల్ తొక్కుతూ దొరికినవారే.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button