Google AI:అప్‌డేట్ వెర్షన్‌లో గూగుల్ ఏఐ డాక్టర్..
Google AI:హెల్త్‌కేర్ AIలో గూగుల్ టాప్ గేర్ అవుతుందని.. MedGemma & MedSigLIPతో గేమ్‌ఛేంజర్‌గా మారడం గ్యారంటీ అంటున్నారు నిపుణులు.

Google AI: హెల్త్‌కేర్ సెక్టార్‌లో గూగుల్ ఇప్పుడు ఏకంగా టాప్ ప్లేస్‌కి దూసుకువచ్చింది. ఓ రేంజ్ ఆవిష్కరణతో, అది కూడా ఫ్రీగా రావడంతో.. మెడ్‌గిమ్మా( MedGemma) ఇప్పుడు మార్కెట్‌ను షేక్ చేస్తోంది. . ఇది నెక్స్ట్-జెన్ AI మోడల్. చెస్ట్ ఎక్స్-రేలు, మెడికల్ పిక్చర్స్, పేషెంట్ హిస్టరీలను ఒక ట్రైన్డ్ రేడియాలజిస్ట్ ఎంత కరెక్టుగా అనలైజ్ చేస్తారో,ఇప్పుడు ఇది కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఇది చేయగలదు. దీని బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే, ఇది ఓపెన్-సోర్స్, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అందుకే గూగుల్ ఈ మూవ్‌తో AI హెల్త్‌కేర్ లీడర్‌గా నిలుస్తోందంటున్నారు నిపుణులు.
MedGemma & MedSigLIP
Google AI: రీసెంట్‌గా లాంచ్ అయిన మెడ్‌గిమ్మా( MedGemma) 27B మెడికల్ AIలో గోల్డ్ స్టాండర్డ్ అయిన MedQA బెంచ్‌మార్క్‌లో సూపర్ ఇంప్రెసివ్‌గా 87.7% స్కోర్ చేసింది. ఈవెన్ దీని స్మాల్ వెర్షన్ కూడా 81% యాక్యూరసీతో యూఎస్ రేడియాలజిస్టుల నుంచి వాలిడేషన్ పొందింది. ఇది రియల్-వరల్డ్ పేషెంట్ కేర్‌లో అసిస్ట్ చేయడానికి మోర్ దెన్ ఎనఫ్! గూగుల్ AI పవర్ ఎంత స్ట్రాంగ్ ఉందో ఈ రిజల్ట్స్‌తో క్లియర్‌గా కనిపిస్తోంది.
ఈ మూవ్‌లో గూగుల్(Google)ని డిఫరెంట్ చేసేది దాని యాక్సెస్. చాలా అడ్వాన్స్‌డ్ మెడికల్ AIలు ఖరీదైన పే-వాల్స్ లేదా క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌ల వెనుక దాగి ఉంటాయి. కానీ గూగుల్, MedGemmaతో పాటు దాని సిబ్లింగ్ మోడల్ MedSigLIPని ఫ్రీగా డౌన్‌లోడ్, మోడిఫై, లోకల్‌గా రన్ చేసుకోవడానికి వీలు కల్పించింది. అంటే, హాస్పిటల్స్, రీసెర్చర్స్, స్టార్టప్‌లు ఇప్పుడు కట్టింగ్-ఎడ్జ్ డయాగ్నస్టిక్ టూల్స్‌ను డేటా ప్రైవసీకి ప్రాబ్లమ్ లేకుండా, బడ్జెట్‌లు బ్రేక్ అవ్వకుండా యూజ్ చేసుకోవచ్చు.
ఈ మోడల్స్ విజువల్స్‌తో పాటు టెక్స్ట్‌ని కూడా అండర్‌స్టాండ్ చేసుకునేలా బిల్డ్ చేశారు. కాబట్టి MedGemma కేవలం ఎక్స్-రేను స్కాన్ చేయడమే కాదు, పేషెంట్ హిస్టరీ లేదా డాక్టర్ నోట్స్‌ని కూడా ఇంటర్‌ప్రెట్ చేయగలదు. ఇది క్లినిషియన్స్‌కి ఓ పవర్‌ఫుల్ డిజిటల్ సెకండ్ ఒపీనియన్ లాంటిది.
గూగుల్ డెసిషన్ ఇప్పటికే హెల్త్‌కేర్ AI వరల్డ్‌లో షాక్‌వేవ్స్ క్రియేట్ చేస్తోంది. MedSigLIP విజువల్, రిటన్ డేటాని కంబైన్ చేసి డయాగ్నస్టిక్ యాక్యూరసీని మరింత షార్పెన్ చేస్తుంది. లిమిటెడ్ మెడికల్ రిసోర్సెస్ లేదా టైట్ బడ్జెట్‌లు ఉన్న రీజియన్స్‌కి ఇది నిజంగా ఒక గేమ్-ఛేంజర్. అఫర్డబుల్, AI-డ్రైవెన్ డయాగ్నస్టిక్స్ అందించే పొటెన్షియల్ ఇప్పుడు రీచ్‌లోకి వచ్చింది—అదీ వరల్డ్‌వైడ్‌గా. గూగుల్ ఈ రంగంలో తన లీడర్‌షిప్‌ను మరింత స్ట్రాంగ్ చేసుకుంటుందంటున్నారు ఎక్స్‌పర్ట్స్.