Just InternationalLatest News

Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ ..ప్రపంచానికి తెలియని ఆ రహస్యం ఏంటి?

Kim Jong Un:చైనాలో జరిగిన ఆయుధ ప్రదర్శనలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కిమ్ జోంగ్ ఉన్ భేటీ అయినప్పుడు, తీసుకున్న జాగ్రత్తలు,ఆయన భద్రతా విధానాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి.

Kim Jong Un

ప్రపంచంలో అత్యంత రహస్యమైన, కఠినమైన పాలన కలిగిన దేశం ఉత్తర కొరియా. ఆ దేశ నాయకుడు కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) గురించి ప్రపంచానికి చాలా తక్కువగా తెలుసు. ఆయనకు సంబంధించిన ఏ విషయం బయటపడినా, అది అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తుంది. తాజాగా చైనాలో జరిగిన ఆయుధ ప్రదర్శనలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఆయన భేటీ అయినప్పుడు, కిమ్ జోంగ్ ఉన్ తీసుకున్న జాగ్రత్తలు,ఆయన భద్రతా విధానాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి.

పుతిన్-కిమ్ భేటీ తర్వాత, రష్యాకు చెందిన జర్నలిస్టులు కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టారు. కిమ్ జోంగ్ ఉన్ వాడిన ప్రతి వస్తువును, ఆయన కూర్చున్న కుర్చీలను కూడా ప్రత్యేక జాగ్రత్తలతో శుభ్రం చేశారని, వాటిపై ఆయన DNA ఆధారాలు మిగలకుండా జాగ్రత్తలు తీసుకున్నారని వారు పేర్కొన్నారు. దీని వెనుక ఉన్న కారణం కేవలం ఆరోగ్య రక్షణ మాత్రమే కాదు, ఆయన వ్యక్తిగత సమాచారం ఏమాత్రం బయటకు వెళ్ళకుండా చూసుకోవడం. కిమ్ జోంగ్ ఉన్ మల వ్యర్థాలను కూడా ప్రత్యేక కేసులలో సేకరించి, బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటారని నివేదికలు చెబుతున్నాయి.

Kim Jong Un
Kim Jong Un

కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) ఈ స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం వెనుక అనేక కారణాలున్నాయి. కిమ్ జోంగ్ ఉన్‌కు గతంలో ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ప్రపంచానికి తెలుసు. 2014-15లో ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని వార్తలు వచ్చాయి. అందుకే తన ఆరోగ్యం గురించి ఏమాత్రం సమాచారం బయటకు రాకుండా చూసుకోవడానికి ఈ జాగ్రత్తలు తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు.

తన రాజకీయ శత్రువులకు, విదేశీ ఇంటెలిజె న్స్ ఏజెన్సీలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తనను తాను కాపాడుకోవాలని కిమ్ కోరుకుంటారు. ఆయన వ్యక్తిగత సమాచారం బయటపడితే, అది రాజకీయంగా ఆయనకు బలహీనత కావచ్చు. ఉత్తర కొరియా పాలనలో సాంకేతిక పరిజ్ఞానం, సైబర్ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. తన ఆరోగ్య వివరాలు, వ్యక్తిగత సమాచారం ఆన్‌లైన్‌లో లీక్ కాకుండా ఉండేందుకు కఠిన నియంత్రణలను పాటిస్తారు.

కిమ్(Kim Jong Un) ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి, ముఖ్యంగా యూరోపియన్ దేశాలు, చైనా, జపాన్ నుంచి నిపుణులను కూడా సహాయం తీసుకుంటారని నివేదికలు ఉన్నాయి. తన వైద్యం కోసం అత్యాధునిక వైద్య పరికరాలు ఉపయోగిస్తారని కూడా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తే, కిమ్ జోంగ్ ఉన్ తన ఆరోగ్యానికి, వ్యక్తిగత భద్రతకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో స్పష్టమవుతుంది.

Trump: ట్రంప్ పగ: రష్యా, చైనాలతో పాటు భారత్‌పై ఘాటు వ్యాఖ్యలు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button