Tours: ఫారెన్ టూర్లకు తక్కువ ఖర్చు.. ఈ దేశాలు బెస్ట్ ఆప్షన్!
Tours: తక్కువ టైంలోనే ఒక ఫారెన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ ప్రదేశాలు మంచి ఆప్షన్ అవుతాయి.

Tours
విదేశాలకు వెళ్లాలంటే నెలల తరబడి ప్లాన్ చేసుకోవాలి, లక్షలు ఖర్చు అవుతాయని చాలామంది అనుకుంటారు. కానీ, మన దేశానికి చాలా దగ్గర్లో… గంటల వ్యవధిలోనే చేరుకోగలిగే, తక్కువ ఖర్చుతో సరదాగా గడిపే ఎన్నో అద్భుతమైన విదేశీ టూరిజం స్పాట్లు ఉన్నాయి. తక్కువ టైంలోనే ఒక ఫారెన్ ట్రిప్(Tours)ను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ ప్రదేశాలు మంచి ఆప్షన్ అవుతాయి.
మన దేశానికి దగ్గరగా ఉన్న టూరిస్ట్ ప్లేస్‌లలో నేపాల్ మొదటిది. కేవలం నాలుగు గంటల ఫ్లైట్ జర్నీతో చేరుకునే ఇక్కడ… ఎత్తైన హిమాలయాలు, పురాతన కట్టడాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. మూడు రోజుల టూర్ ప్యాకేజీ కేవలం 16 నుంచి 25 వేల రూపాయల ఖర్చుతో ఉంటుంది. అలాగే, దేవభూమిగా పిలిచే భూటాన్‌కు రెండున్నర గంటల్లో చేరుకోవచ్చు. ఇక్కడి పర్వతాలు, పచ్చని ప్రకృతి సోయగాలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. కేవలం ఒక వారం పాటు, 30-40 వేల రూపాయల ఖర్చుతో ఇక్కడి అందాలను చుట్టి రావచ్చు.

సెలబ్రిటీల ఫేవరెట్ స్పాట్‌గా పేరుగాంచిన మాల్దీవులు కూడా మనకు చాలా దగ్గరగా ఉన్నాయి. కొచ్చి నుంచి కేవలం నాలుగు గంటల్లోనే ఇక్కడికి వెళ్లొచ్చు. లగ్జరీ టూర్ కోరుకునే వారికి ఇది ఒక అఫర్డబుల్ స్పాట్. నాలుగు రోజుల ట్రిప్‌కు 35-45 వేల రూపాయలు మాత్రమే ఖర్చు వస్తుంది. ఇక, ప్రపంచ ప్రసిద్ధి చెందిన దుబాయ్.. బీచులు, బుర్జ్ ఖలీఫా, మరియు షాపింగ్‌కు పెట్టింది పేరు. ముంబై నుంచి కేవలం నాలుగు గంటల్లోనే చేరుకుని, ఐదు రోజుల ట్రిప్‌ను 30-38 వేల ఖర్చుతో ఎంజాయ్ చేయవచ్చు.

అత్యంత విలాసవంతమైన ప్రదేశాల్లో ఒకటైన సింగపూర్‌కు నాలుగున్నర గంటల్లో చేరుకోవచ్చు. సుమారు 60-70 వేల ఖర్చుతో ఏడు రోజుల పాటు సింగపూర్, మలేషియాను కూడా కలిపి చుట్టి రావచ్చు. ఇక థాయ్‌లాండ్ కూడా బడ్జెట్ టూరిజానికి బెస్ట్ ఆప్షన్. నాలుగున్నర గంటల జర్నీతో బ్యాంకాక్ బీచ్ అందాలను ఆస్వాదించవచ్చు. ఆరు రోజుల టూరిజం ప్యాకేజీలు కేవలం 40-50 వేల ఖర్చులోనే ఉన్నాయి. మూడున్నర గంటల్లోనే చేరుకునే ఒమన్ కూడా అరేబియా సముద్ర బీచ్‌లతో పర్యాటకులను ఆకర్షిస్తుంది.
One Comment