Sheikh Hasina:షేక్ హసీనాకు 10 ఏళ్ల జైలు శిక్ష.. పాత శిక్షలతో కలిపి హసీనా ఎన్నేళ్ల శిక్ష పడనుంది?
Sheikh Hasina: ఒక వెలుగు వెలిగిన షేక్ హసీనా సామ్రాజ్యం.. కొన్ని నెలల నుంచి కోర్టు తీర్పులు, జైలు శిక్షల మధ్య కుప్పకూలుతోంది.
Sheikh Hasina
బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో మొన్నటివరకూ ఒక వెలుగు వెలిగిన షేక్ హసీనా సామ్రాజ్యం.. కొన్ని నెలల నుంచి కోర్టు తీర్పులు, జైలు శిక్షల మధ్య కుప్పకూలుతోంది. ఢాకా వీధుల్లో విద్యార్థుల నిరసనల సెగలు తట్టుకోలేక బంగ్లాదేశ్ విడిచి పారిపోయిన ఆమెకు, ఇప్పుడు అక్కడి చట్టం తన ప్రతాపాన్ని చూపిస్తోంది.
ముఖ్యంగా పుర్బాచల్ భూ కుంభకోణం హసీనా రాజకీయ జీవితానికే కాకుండా, ఆమె కుటుంబ గౌరవానికి కూడా పెద్ద మచ్చగా మిగిలిపోయింది. దీంతో ఈ భారీ కుంభకోణం వివరాలు, కోర్టు తీర్పులు గురించి లోతైన చర్చ సాగుతోంది.
2010లో ఢాకా నగరాన్ని ట్రాఫిక్ , జనసాంద్రత నుంచి కాపాడటానికి.. పుర్బాచల్ న్యూ టౌన్ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. సుమారు 22,500 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాజెక్టులో పేదలకు, మధ్యతరగతి వారితో పాటు దౌత్యవేత్తలకు ప్లాట్లు కేటాయించాల్సి ఉంది. అయితే హసీనా ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో.. ఈ కలల ప్రాజెక్టు కాస్తా అవినీతికి నిలయంగా మారిందన్ విమర్శలు ఉన్నాయి.
ముఖ్యంగా సెక్టార్ 27లోని డిప్లొమాటిక్ జోన్‌లో ఉన్న అత్యంత ఖరీదైన ప్లాట్లను.. షేక్ హసీనా(Sheikh Hasina) తన కుటుంబ సభ్యులకు రూల్స్ కు విరుద్ధంగా కట్టబెట్టారు. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో ..రాజుక్ అధికారులు నిబంధనలన్నీ పక్కన పెట్టేసి, అర్హత లేని హసీనా వారసులకు ప్లాట్లను కేటాయించారు.
ఫిబ్రవరి 2, 2026న ఢాకా కోర్టు ఈ కుంభకోణానికి సంబంధించి సంచలన తీర్పు ఇచ్చింది. జడ్జి మహ్మద్ రబీయుల్ ఆలం ఈ కేసులో హసీనాకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించారు. కేవలం షేక్ హసీనా(Sheikh Hasina) మాత్రమే కాకుండా, ఆమె మేనకోడలు , బ్రిటిష్ ఎంపీ తులిప్ సిద్ధిక్‌కు 4 ఏళ్లు, మరో మేనకోడలు అజ్మినా సిద్ధిక్, మేనల్లుడు రద్వాన్ ముజీబ్ సిద్ధిక్ (బాబీ)లకు ఒక్కొక్కరికి 7 ఏళ్ల జైలు శిక్ష పడింది
అంతకుముందు కూడా ఇతర అవినీతి కేసుల్లో షేక్ హసీనాకు ఏకంగా 26 ఏళ్ల శిక్ష పడటంతో, ఇప్పుడు ఆ శిక్షా కాలం కూడా కలిపితే దాదాపు 50 ఏళ్లు దాటిపోయింది. 78 ఏళ్ల వయసులో భారత దేశంలో తలదాచుకుంటున్న హసీనాకు, బంగ్లాదేశ్ కోర్టులు ఇస్తున్న ఈ తీర్పులు పెద్ద అగాధంలా మారిపోయాయి.
మరోవైపు అవినీతి నిరోధక కమిషన్ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంి. షేక్ హసీనా తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన సోదరి షేక్ రెహానాతో పాటు ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్, కుమార్తె సైమా వాజెద్ పుతుల్‌లకూ ఈ అక్రమ కేటాయింపుల్లో ఆమె వాటా ఇచ్చినట్లు అవినీతి నిరోధక సంస్థ ఆరోపిస్తోంది.

దీనికోసం సుమాు 20 మంది సీనియర్ ప్రభుత్వ అధికారులు సహకరించారని అంటుంది. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించడం, లాటరీ ప్రక్రియను తారుమారు చేయడం ద్వారా ఈ భారీ అవినీతి దోపిడీ సాగింది. ఢాకాలో భూమి కోసం సామాన్యులు అల్లాడుతుంటే, అధికారం చేతిలో ఉందని హసీనా కుటుంబం మాత్రం రాజ్యంలోని సంపదను పంచుకుందని ఆరోపణలు గుప్పిస్తోంది.
అయితే ఈ తీర్పు అంతర్జాతీయంగా కూడా పెను సంచలనాన్ని సృష్టిస్తోంది. మరోవైపు బ్రిటిష్ ఎంపీగా ఉన్న తులిప్ సిద్ధిక్ ఈ స్కామ్‌లో దోషిగా తేలడం బ్రిటన్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమెను తమను అప్పగించాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తుంటే, అక్కడ లేబర్ పార్టీ హసీనాను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.
మరోవైపు బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనుస్ నేతృత్వంలోని మధ్యంతర గవర్నమెంట్ ఈ కేసులను వేగంగా ఓ కొలిక్కి తెస్తోంది. హసీనా అనుచరులు, అధికారులను ఒక్కొక్కరుగా ఇప్పుడు చట్టం ముందు నేరస్థులుగా నిలబెడుతుంది.
Gold and Silver:బంగారం ప్రియులకు బొనాంజా.. కుప్పకూలిన పసిడి, వెండి ధరలు



