Steinway Tower: గాలికి ఊగే అపార్ట్మెంట్.. స్టెయిన్వే టవర్ రహస్యం ఏంటసలు?
Steinway Tower: ఈ అపార్ట్మెంట్ గట్టిగా గాలి వీస్తే ఊగడం దాని నిర్మాణ శైలిలోని ఒక భాగం.లోపల ఉన్న వారికి ఈ ఊగుతున్న అనుభూతి తెలియకుండా ఉండేలా ఈ భవనాన్ని డిజైన్ చేశారు.

Steinway Tower
ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన నిర్మాణాలను మనం చూస్తుంటాం. అత్యంత పొడవైనవి, అతి వెడల్పుగా ఉన్నవి… ఇలా ఒక్కో భవనానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే భవనం మాత్రం ప్రపంచంలోనే అత్యంత సన్నని, పొడవైన నివాస భవనం.
కేవలం దాని సన్నని ఆకారం మాత్రమే కాదు, గాలి వీస్తే ఇది సుమారు 2 అడుగుల వరకు ఊగుతుంది. ఇదే దీని ప్రత్యేకత! ఈ అద్భుతమైన నిర్మాణం అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉన్న మాన్‌హట్టన్‌లో ఉంది.
స్టెయిన్వే టవర్(Steinway Tower) అని పిలువబడే ఈ 84 అంతస్తుల లగ్జరీ అపార్ట్మెంట్, చూపరులను ఆకట్టుకుంటోంది. సెంట్రల్ పార్క్ టవర్ మరియు వరల్డ్ ట్రేడ్ సెంటర్ తర్వాత ప్రపంచంలోనే అత్యంత సన్నని ఆకాశహర్మ్యంగా దీనికి గుర్తింపు లభించింది.

సుమారు 1,428 అడుగుల ఎత్తు ఉన్న ఈ టవర్(Steinway Tower)ను అత్యంత బలంగా ఉండే కాంక్రీట్‌తో నిర్మించారు. ఈ టవర్‌కు స్ట్రక్చరల్ ఇంజనీర్లుగా రోవాన్ విలియమ్స్ డేవిస్ మరియు ఇర్విన్లు వ్యవహరించారు.
ఈ అపార్ట్మెంట్ గట్టిగా గాలి వీస్తే ఊగడం దాని నిర్మాణ శైలిలోని ఒక భాగం. సాధారణ గాలులకు ఇది 2 అడుగుల వరకు ఊగుతుంది. ఒకవేళ గంటకు 100 మైళ్ల వేగంతో గాలులు వీస్తే, అది మరింత ఎక్కువగా ఊగుతుంది.
కానీ, లోపల ఉన్న వారికి ఈ ఊగుతున్న అనుభూతి తెలియకుండా ఉండేలా ఈ భవనాన్ని డిజైన్ చేశారు. ఈ నిర్మాణం ఇంజనీరింగ్ అద్భుతాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. స్టెయిన్వే టవర్‌లో ఒక స్టూడియో అపార్ట్మెంట్ ధర దాదాపు రూ.60 కోట్లు ఉంటుందంటేనే ఇది ఎంత లగ్జరీ అపార్ట్మెంట్లో అర్థం చేసుకోవచ్చు.
3 Comments