Anemia
ప్రస్తుతం చాలామంది మహిళలు , చిన్న పిల్లల్లో రక్తహీనత (Anemia) అనేది మేజర్ సమస్యగా మారింది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గడం వల్ల నీరసం, అలసట, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని సరైన సమయంలో గుర్తించలేకపోతే ఇతర అనారోగ్య సమస్యలకు కూడాదారి తీస్తుంది.
ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా రక్తహీనత సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. మన వంటింట్లో దొరికే బెల్లం రక్తహీనతకు అద్భుతమైన మందు. పంచదారకు బదులుగా బెల్లం వాడటం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా వేరుశనగ పప్పులు , బెల్లం కలిపి తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.
అలాగే ఆకుకూరలు, ముఖ్యంగా తోటకూర, పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు దానిమ్మ పండు రసం తాగడం వల్ల రక్తంలో ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి. ఖర్జూర పండ్లు కూడా రక్తహీనతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
అంతేకాదు ముఖ్యమైన విషయం ఏంటంటే..ఐరన్ మన శరీరం గ్రహించాలంటే శరీరానికి విటమిన్ సి కూడా అవసరం. అందుకే ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకున్నప్పుడు నిమ్మరసం , ఉసిరికాయ వంటివి తీసుకోవాలి.
మొలకెత్తిన గింజలు కూడా రక్తహీనతకు మంచి పరిష్కారం. టీ, కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల ఐరన్ గ్రహించే శక్తి తగ్గిపోతుంది. అలాగే భోజనం చేసిన వెంటనే కూడా టీ , కాఫీలను తాగకూడదు. ఈ చిన్న ఆహారపు మార్పులతో రక్తహీనతను తరిమికొట్టవచ్చు.
Bones: ఎముకలు ఉక్కులా మారాలంటే ఇలా చేయండి..
