Bones: ఎముకలు ఉక్కులా మారాలంటే ఇలా చేయండి..
Bones: డెయిలీ వాకింగ్ లేదా యోగా చేయడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది.
Bones
వయసు పెరిగే కొద్దీ చాలామంది ఎదుర్కొనే మెయిన్ సమస్య ఎముకల బలహీనత , కీళ్ల నొప్పులు. మన శరీరానికి ఆధారం ఎముకలే, అవి బలంగా లేకపోతే చిన్న దెబ్బ తగిలినా ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ తర్వాత కాల్షియం లోపం చాలా ఎక్కువగా కనిపిస్తుంది.
ఎముకల (Bones)ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాల్షియం , విటమిన్-డి చాలా అవసరం. కేవలం పాలు తాగితే సరిపోదు, ఆకుకూరలు, రాగులు, నువ్వులు , బాదం పప్పు వంటి వాటిలో కాల్షియం కావాల్సినంతగా ఉంటుంది. అలాగే మన శరీరం కాల్షియంను గ్రహించాలంటే విటమిన్-డి కావాలి. ఇది ఉదయం పూట ఎండలో కనీసం 15 నుంచి 20 నిమిషాలు ఉండటం వల్ల సహజంగా లభిస్తుంది.

ఎముకలు (Bones)బలంగా ఉండాలంటే శారీరక శ్రమ కూడా అవసరమే అంటున్నారు డాక్టర్లు. డెయిలీ వాకింగ్ లేదా యోగా చేయడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది. కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీలు , సాఫ్ట్ డ్రింక్స్ అతిగా తీసుకోవడం వల్ల ఎముకల్లోని కాల్షియం తగ్గిపోయే ప్రమాదం ఉంది.
అలాగే సాల్ట్ వాడకాన్ని తగ్గించడం వల్ల కూడా ఎముకలకు మేలు చేస్తుంది. అంతేకాకుండా చిన్న వయసు నుండే పిల్లలకు బలమైన ఆహారం అందిస్తే భవిష్యత్తులో ఎముకల వ్యాధులు, ఎముకలు వీక్ అవడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
అలాగే కీళ్ల నొప్పులు లేదా ఎముకల్లో శబ్దాలు రావడంలాంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా కాల్షియం పరీక్ష చేయించుకోవడం మంచిది. నిలకడగా వ్యాయామం చేయడం ద్వారా మన స్కెలిటిన్ సిస్టంను యవ్వనంగా ఉంచుకోవచ్చు.




One Comment