Just LifestyleHealthLatest News

Dehydration:పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. డీహైడ్రేషన్ బారిన పడే ఛాన్స్ ఉందా?

Dehydration: ప్రస్తుతం హైదరాబాద్‌లో పొడి వాతావరణం వల్ల డీహైడ్రేషన్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంది.

Dehydration

హైదరాబాద్‌లో పగటి పూట ఉష్ణోగ్రతలు మెల్లగా పెరుగుతున్నాయి. వాతావరణ శాఖ (IMD) హెచ్చరికల ప్రకారం.. ప్రస్తుతం హైదరాబాద్‌లో పొడి వాతావరణం వల్ల డీహైడ్రేషన్(Dehydration) రిస్క్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే నగరంలోని ప్రముఖ ఆసుపత్రుల్లో 20% కేసులు ఈ డీహైడ్రేషన్ వల్లే నమోదవుతున్నాయి.

ఈ వేడి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవడానికి రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం తప్పనిసరి.
ఉదయం 7-10 గంటల మధ్య.. కనీసం 1 లీటర్ నీళ్లలో నిమ్మరసం కలిపి అయినా లేదా మజ్జిగ అయినా తాగండి.
మధ్యాహ్నం 12-2 గంటల మధ్య.. ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 500ml ORS కానీ ఎలక్ట్రోలైట్ వాటర్ తీసుకోవాలి.
సాయంత్రం 4-7 గంటల మధ్య.. ఒక కొబ్బరి నీళ్ల గ్లాసు (300ml) తీసుకుంటే మీ ఒంటికి చలవ చేస్తుంది.
రాత్రి పడుకునే ముందు.. 500ml గోరువెచ్చని నీటిలో కొంచెం తేనె కలుపుకుని తాగితే బాడీ రిలాక్సవుతుంది.

ఆహారంలో మార్పులు – ఏమి తినాలి? ఏమి వద్దు అనేది చూసుకోవాలి..

తినాల్సినవి.. తోటకూర, పాలకూర, సూప్‌లు, కీర దోస, బీట్‌రూట్ సలాడ్స్, బొప్పయి, దోసకాయ పెరుగు పచ్చడి వంటివి తీసుకోవాలి.
మానుకోవాల్సినవి.. నూనెలో వేయించిన పదార్థాలు (ఫ్రైస్), ఎక్కువ మసాలాలు ఉన్న ఆహారం మిమ్మల్ని త్వరగా డీహైడ్రేట్(Dehydration) చేస్తాయి.
ప్రో టిప్.. మీ మూత్రం పసుపు రంగులో ఉంటే కనుక మీ శరీరానికి అదనంగా మరో లీటర్ నీరు అవసరమని గుర్తుంచుకోవాలి.

సన్‌స్క్రీన్..బయటకు వెళ్తున్నపుడు SPF50 ఉన్న సన్‌స్క్రీన్ రాసుకుని కనీసం 20 నిమిషాల తర్వాతే బయటకు వెళ్లండి. ముఖంతో పాటు మెడకు,చేతులకు అప్లై చేయాలి
ఫుల్ స్లీవ్స్ ఉన్న డ్రస్సులు, షర్టులు వేసుకోవాలి. క్యాప్ కానీ స్కార్ఫ్ కానీ ధరించండి. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిది.

Dehydration
Dehydration

దాహం, నోరు ఆరిపోవడం జరుగుతాయి ఇలాంటపుడు వెంటనే నీళ్లు తీసుకుంటే సరిపోతుంది. తలనొప్పి, కళ్లు తిరగడం, ముదురు రంగులో మూత్రం ఉంటే మాత్రం ORS వెంటనే తీసుకోవాలి. వాంతులు, గందరగోళం, స్పృహ తప్పడం కనిపిస్తే దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లాలి.

Cloud Kitchen:క్లౌడ్ కిచెన్ ఎలా స్టార్ట్ చేయాలో ఐడియా లేదా..అయితే ఇది మీకోసమే..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button