Just LifestyleHealthLatest News

Social Media:సోషల్ మీడియాలో ఫోమోకు, జోమోకు తేడా తెలుసా? మీకు ఏది మంచిది?

Social Media: ప్రపంచంలో ఏదో జరిగిపోతోంది, అందరూ ఆనందంగానే ఉన్నారు, తాను మాత్రమే వెనుకబడిపోతున్నాననే ఒక రకమైన ఆందోళన పెరుగుతోంది.

Social Media

సోషల్ మీడియాలో అనవసరమైన పోలికలు మన ఆత్మగౌరవాన్ని తగ్గిస్తాయి కాబట్టి, వర్చువల్ ప్రపంచం కంటే నిజ జీవితంలోని బంధాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి.

ఇప్పుడంతా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు స్మార్ట్‌ఫోన్ అనే మాయా ప్రపంచంలోనే బ్రతుకుతున్నారు. అయితే అసలు సమస్య సోషల్ మీడియాకు ఎడిక్ట్ అవడంలోనే ఉందంటున్నారు నిపుణులు.

ముఖ్యంగా సోషల్ మీడియా(Social Media)లో రెగ్యులర్‌గా ఇతరుల జీవితాలను చూడటం వల్ల తెలియకుండానే ఫోమో (FOMO – Fear of Missing Out) పెరుగుతోంది. అంటే, ప్రపంచంలో ఏదో జరిగిపోతోంది, అందరూ ఆనందంగానే ఉన్నారు, తాను మాత్రమే వెనుకబడిపోతున్నాననే ఒక రకమైన ఆందోళన పెరుగుతోంది.

ఎవరైనా కొత్త కారు కొన్నట్లు ఫోటో పెట్టినా, ఎక్కడికైనా ట్రిప్ వెళ్లినట్లు పోస్ట్ చేసినా మనలో ఒక రకమైన అసంతృప్తి మొదలవుతుంది. ఈ మానసిక ఒత్తిడి నుండి బయటపడి ప్రశాంతంగా జీవించడాన్ని డిజిటల్ మినిమలిజం లేదా డిజిటల్ హాయి అంటారు.

డిజిటల్ హాయి అంటే టెక్నాలజీని పూర్తిగా మానేయమని కాదు.కేవలం దానిని మన అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవాలి. సోషల్ మీడియా(Social Media) అల్గారిథమ్స్ మనల్ని గంటల తరబడి స్క్రీన్ కి అతుక్కుపోయేలా చేస్తాయి. దీని నుంచి బయటపడాలంటే మొదట మనం నోటిఫికేషన్లను కంట్రోల్ చేయాలి.

ప్రతి నిమిషానికి వచ్చే అప్‌డేట్స్ మన మెదడును కంటెన్యూగా అలర్ట్ మోడ్‌లో ఉంచుతాయి. అలాగే ఇన్ స్టా , ఫేస్ బుక్ ‌కు ఒక టైమ్ పెట్టుకోవాలి. అంటే సోషల్ మీడియా ఫీడ్ ను చూసే సమయాన్ని రోజుకు ఒక గంట, అరగంట అంటూ టైమ్ లిమట్ చేసుకోవాలి.

మనకు నిజంగా ఉపయోగపడే సమాచారాన్ని ఇచ్చే అకౌంట్లను మాత్రమే ఫాలో అవ్వాలి. సోషల్ మీడియాలో అనవసరమైన పోలికలు మన ఆత్మగౌరవాన్ని తగ్గిస్తాయి కాబట్టి, వర్చువల్ ప్రపంచం కంటే నిజ జీవితంలోని బంధాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి.

Social Media
Social Media

మనం చూసే ప్రతిదీ నిజం కాదని, సోషల్ మీడియాలో చూపించే అందరి జీవితాలు కేవలం ఒక చిన్న భాగం మాత్రమేనని గుర్తించాలి. అప్పుడే మనలో ఉన్న ఫోమో తగ్గి జోమో (JOMO-Joy of Missing Out) స్లార్ట్ చేయాలి. అంటే ఆ గందరగోళంలో లేను, నేను ప్రశాంతంగా ఉన్నాననే ఆనందం పెంచుకోవాలి అన్నమాట.

మొత్తంగా ఈ డిజిటల్ మినిమలిజం పాటించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.దీనివల్ల అనవసరమైన ఆందోళనలు తగ్గుతాయి, జీవితంపై మనకు స్పష్టత వస్తుందని చెబుతున్నారు.

Taxpayers:బడ్జెట్ 2026లో సామాన్యుడికి కూల్ కబురు అందినట్లేనా? ట్యాక్స్ పేయర్స్‌కు శుభవార్త వచ్చిందా?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button